ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత ప్రాంతానికి ఇప్పటికే వెన్నుపోటు పొడిచారని, ఇంకా పొడుస్తూనే ఉన్నారని వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి విమర్శించారు. తిరుపతిలో ఉన్న నైలేట్ సంస్థను అమరావతికి తీసుకెళ్లడం ద్వారా మరో వెన్నుపోటు పొడిచారన్నారు.
ఢిల్లీలో ‘సాక్షి’తో ముఖాముఖిలో మాట్లాడిన ఎంపీ గురుమూర్తి.. చంద్రబాబు అమరావతిలో భూముల ధరలు పెంచుకునేందుకు నైలేట్ సంస్థను తీసుకెళుతున్నారని మండిపడ్డారు.
ఇలా చేయడం ద్వారా స్థానిక విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు గురుమూర్తి. తిరుపతితో లక్షల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారని, వారు స్కిల్స్ నేర్చుకునేందుకు నైలేట్ సంస్థను ఇక్కడకు తీసుకొస్తే దాన్ని అమరావతికి తీసుకెళ్లిపోతున్నారని మండిపడ్డారు.
‘చంద్రబాబు తన సొంత ప్రాంతానికి వెన్నుపోటు పొడిచారు... ఇంకా పొడుస్తున్నారు. తిరుపతిలో లక్షల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. స్కిల్స్ పెంచుకునేందుకు చెన్నై ఢిల్లీ లాంటి దూర ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. దీన్ని గమనించి నైలేట్ ఇన్సిట్యూట్‌ను శాశ్వత ఎగ్జాంపుల్ ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు.
దాంతో 2025లో టెంపరరీ క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాదాపు 1200 మంది విద్యార్థులు అక్కడ రకరకాల కోర్సులు అభ్యసిస్తున్నారు. తిరుపతి చుట్టుపక్కల ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెజ్ లో ఉన్నాయి. నైలేట్ శాశ్వత క్యాంపస్ కూడా ఇక్కడే నిర్మిస్తామని చెప్పారు.
తిరుపతిలో ఉన్న నైలేట్ సంస్థను చంద్రబాబు అమరావతికి తీసుకెళ్లడం ద్వారా తిరుపతి విద్యార్థులకు తీరని నష్టం చేస్తున్నారు. చంద్రబాబు రాయలసీమ వెంకటేశ్వర యూనివర్సిటీలోనే చదువుకున్నారు. చంద్రబాబు తన సొంత ప్రాంతానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. అమరావతిలో భూముల ధరలు పెంచుకునేందుకు నైలేట్ సంస్థను తీసుకెళుతున్నారు.
దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తిరుపతిలోనే పర్మినెంట్ క్యాంపస్ పెట్టాలి. తిరుపతి ప్రాంతంలో ఇన్‌స్టిట్యూట్‌కు ఈకో సిస్టం ఉంది. అమరావతికి వేరొక సంస్థను పెట్టండి. క్వాంటం యూనివర్సిటీ పేరుతో ఎంఓయు చేసుకొని నైలేట్ యూనివర్సిటీని లాగేసుకుంటున్నారు. చంద్రబాబు.. ఐటీ శాఖ అధికారులను సంశయంలోకి నెట్టారు. నైలాట్ సంస్థ కోసం విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తాం’ అని హెచ్చరించారు.


