రైతు ఉద్యమం నేపథ్యంలో అలర్ట్‌ అయిన కాషాయ కూటమి

No Confidence Motion In Haryana Assembly - Sakshi

చండీఘడ్‌: హర్యానా రాష్ట్రంలో అధికార బీజేపీ కూటమి చిక్కుల్లో పడింది. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిడంతో రేపు అసెంబ్లీలో ఓటింగ్ జరుగనుంది. మొత్తం 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలుండగా, మిత్రపక్షం జన్‌ నాయక్‌ జనతా పార్టీ (జేజేపీ)కి 10 మంది శాసనసభ్యులున్నారు. బీజేపీపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోవాలి అంటే 45 మంది సభ్యుల మద్దతు అవసముంటుంది. 

సంఖ్యాపరంగా చూస్తే బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేనప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రానికి చెందిన రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలను చేపడుతన్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలైన చోటు చేసుకోవచ్చని నిఘా వర్గాల సమాచారంతో కాషాయ కూటమి అలర్ట్‌ అయ్యింది. 

కాగా, 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అధికార కూటమికి 50 మంది శాసనసభ్యులు, కాంగ్రెస్‌కు 30, ఇతర పార్టీలకు 8 మంది శాసనసభ్యులున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేపు తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరుకావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విప్ జారీ చేశారు.  ఇటు బీజేపీ, జేజేపీ లు కూడా విప్ జారీ చేసాయి. బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని మిత్రపక్షం  జేజేపీ ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top