నకిరేకల్ బీఆర్‌ఎస్‌లో మరోసారి బయటపడ్డ వర్గపోరు.. వీరేశంపై చిరుమర్తి తీవ్ర విమర్శలు..

Nakrekal BRS Chirumarthi Lingaiah Fires On Vemula Veeresham - Sakshi

నల్లగొండ: నకిరేకల్ బీఆర్ఎస్‌లో వర్గపోరు మరోసారి బయటపడింది.  మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని టార్గెట్ చేస్తూ ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర విమర్శలు చేశారు. నాలుగు సంవత్సరాలుగా ఆయనకు పార్టీలో సభ్యత్వమే లేదని వ్యాఖ్యానించారు. వీరేశం ఎక్కడ ఉంటున్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు.

'ఒకసారి ఎంపీగా పోటీ చేస్తా అంటావు. మరొకసారి ఇంకో నియోజకవర్గం పేరు చెప్తావు. ఇంకోసారి‌ ఎమ్మెల్సీ, మంత్రి అంటున్నావు. గతంలో తొడలుకొట్టి ఓ పేపరు చూపించారు. ఇప్పుడు అది ఎటుపోయిందో ఎవరికీ తెలియదు. ప్రజల్ని అనుచరులని అయోమయానికి గురి చేస్తున్నావు. గతంలో జిల్లాలో ఎక్కడపడితే అక్కడ కబ్జాలు జరిగేవి. నకిరేకల్‌కు గతంలో కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నా.' అని చిరుమర్తి వ్యాఖ్యానించారు.
చదవండి: రాజకీయం రసకందాయం! సబిత పెత్తనం ఏమిటంటున్న తీగల

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top