Munugode Bypoll 2022 Result: మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయం

Munugode Bypoll 2022 Result Live Updates - Sakshi

Time: 5:10PM

►మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయం

►ఏడు మండలాల్లో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం

►14 రౌండ్లు ముగిసేసరికి సుమారు 10వేల ఓట్ల ఆధిక్యంలో నిలిచిన టీఆర్‌ఎస్‌

► 14వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌దే ఆధిక్యం

Time: 04:35PM

► విజయం దిశగా టీఆర్‌ఎస్‌

► 13 రౌండ్లు ముగిసే సరికి టీఆర్‌ఎస్‌9,039 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది.

► 13వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 1,002 ఓట్ల ఆధిక్యం

► కాంగ్రెస్‌కు డిపాజిట్‌ గల్లంతు.

Time: 03:53 PM
7,836 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌
12వ రౌండ్‌ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ పార్టీ 7,836 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 12వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 2,042 ఓట్ల ఆధిక్యం దక్కింది.

Time: 03:45 PM
కేటీఆర్‌ మీడియా సమావేశం
సాయంత్రం 5 గంటలకు కేటీఆర్‌ మీడియా సమావేశం.

Time: 03:14 PM
తెలంగాణ భవన్‌లో సంబురాలు షురూ.. 
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. రౌండ్‌లు ముగిసే కొద్ది భారీ ఆధిక్యం సాధిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. బాణసంచా కాల్చి, స్వీట్స్‌ పంచుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Time: 03:09 PM
11వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
11వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. 11వ రౌండ్‌ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ పార్టీ 5,794 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

Time: 02:44 PM
10వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
10వ రౌండ్‌లోనూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధిక్యంలో కనబరిచింది.  10వ రౌండ్‌ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ పార్టీ 4,436 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 10వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 484 ఓట్ల ఆధిక్యం సంపాదించింది.

Time: 02:16 PM
9వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
9వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీనే ఆధిక్యం సాధించింది. 9 రౌండ్లు ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ 3,952 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 9వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీకి 7,515 ఓట్లు రాగా.. బీజేపీకి 6,665 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,300 ఓట్లు, ఇతరులకు 1,100 ఓట్లు వచ్చాయి. 

Time: 01:58 PM
చండూరుపైనే బీజేపీ ఆశలు
9వ రౌండ్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చండూరు మున్సిపాలిటీ లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. చండూరుపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. 9,10 రౌండ్లలో చండూరు ఓట్ల లెక్కింపు జరుగనుంది.

Time: 01:54 PM
8వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
8వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉంది. 8 రౌండ్లు ముగిసేసరికి 3,104 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్ కొనసాగుతోంది. 8 రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 536 ఓట్లు ఆధిక్యం కనబర్చింది.

Time: 01:45 PM
చండూరు మున్సిపాలిటీ లెక్కింపుపై ఉత్కంఠ
8వ రౌండ్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌కు 45,710, బీజేపీకి 43,155 ఓట్లు పోల్‌ అయ్యాయి. ఇప్పటివరకు 1,10,000 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. చండూరు మున్సిపాలిటీ లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. చండూరుపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. 9,10 రౌండ్లలో చండూరు ఓట్ల లెక్కింపు జరగనుంది.

Time: 01:27 PM
ఏడో రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
ఏడో రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఏడు రౌండ్లు ముగిసేసరికి 2,555 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ ఉంది. ఏడో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 386 ఓట్లు ఆధిక్యం కనబర్చింది.
ఏడో రౌండ్‌
టీఆర్‌ఎస్‌- 7,189
బీజేపీ-6,803

Time: 12:59 PM
ఏడో రౌండ్‌ ఓట్లు లెక్కింపు
మునుగోడులో హైవోల్టేజ్‌ హీట్ కొనసాగుతోంది. ఏడో రౌండ్‌ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. ఏడో రౌండ్‌లో మునుగోడు మండలం ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Time: 12:34 PM
ఆరో రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
ఆరో రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆరో రౌండ్‌ ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ ఉంది. చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయపురం ఓట్లు లెక్కింపు ముగిసింది.
ఆరో రౌండ్‌
టీఆర్‌ఎస్‌-6,016
బీజేపీ​- 5,378

Time: 12:05 PM
పారదర్శకంగా కౌంటింగ్‌: సీఈవో
ఆరో రౌండ్‌ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. కౌంటింగ్‌ పారదర్శకంగా జరుగుతోందని సీఈవో వికాస్‌రాజ్‌ అన్నారు. ఆలస్యానికి కారణాలు కూడా వివరించాలని చెప్పానన్నారు. కౌంటింగ్‌లో ఎలాంటి అవకతవకలు లేవన్నారు. ఎన్నికల పరిశీలకులు కూడా అక్కడ ఉన్నారన్నారు. ఎక్కువ మంది పోటీలో ఉండటం వల్లే కౌంటింగ్‌ ఆలస్యం అవుతుందని సీఈవో తెలిపారు.

Time: 11:47 AM
ఐదో రౌండ్‌ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉంది.  1430 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ కొనసాగుతోంది.
ఐదో రౌండ్‌
టీఆర్‌ఎస్‌​- 5,961
బీజేపీ-5,245

Time: 11:18 AM
ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ ఆధిక్యాన్ని వెల్లడించడం లేదంటూ ఆరోపించారు. ఫలితాల్లో ఆలస్యం జరుగుతోంది. జాప్యానికి కారణలేంటో ఈసీ చెప్పాలని బండి సంజయ్‌ అన్నారు.

Time: 11:13 AM
కాసేపట్లో ఐదో రౌండ్‌ ఫలితం
ప్రతి రౌండ్‌కు ఉత్కంఠ కొనసాగుతుంది. రౌండ్‌ రౌండ్‌కు ఆధిక్యం మారుతుంది. ఐదో రౌండ్‌ కౌంటింగ్‌ కొనసాగుతుంది.

Time: 10:39 AM
చౌటుప్పల్‌ మండలంలో పోలైన ఓట్లు-55,678
టీఆర్‌ఎస్‌​- 21,209
బీజేపీ-21,174
కాంగ్రెస్‌​-5,169

Time: 10:34 AM
ఫలితం ఎలానైనా ఉండొచ్చు: రాజగోపాల్‌రెడ్డి
చౌటుప్పల్‌లో తాను అనుకున్న మెజార్టీ రాలేదని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఫలితం ఎలానైనా ఉండొచ్చన్నారు.  చివరి వరకు హోరాహోరీ తప్పకపోవచ్చని ఆయన అన్నారు.

Time: 10:31 AM
మునుగోడులో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలోకి వచ్చింది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి 714 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ ఉంది.

నాలుగో రౌండ్‌
టీఆర్‌ఎస్‌​‍-4,854
బీజేపీ-4,555
కాంగ్రెస్‌​‍-1817

Time: 10:19 AM
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల సొంత గ్రామం లింగవారి గూడెం లో బీజేపీ ఆధిక్యం

Time: 10:09 AM
మునుగోడులో బీజేపీ ఆధిక్యం
మునుగోడులో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది.

Time: 10:05 AM
ఐదో రౌండ్‌ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు.ఐదో రౌండ్‌లో నారాయణపురం ఓట్లు లెక్కిస్తున్నారు. నాలుగో రౌండ్‌లో 1100 ఓట్లకు పైగా బీజేపీ ఆధిక్యంలో ఉంది.

Time: 09:57 AM
మూడు రౌండ్లు ముగిసే సరికి 35 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ కొనసాగుతుంది.
మూడో రౌండ్‌
టీఆర్‌ఎస్‌-7,010
బీజేపీ​-7,426
కాంగ్రెస్‌-1,532

Time: 09:54 AM
మొదటి రౌండ్‌లో కేఏ పాల్‌కు 34 ఓట్లు
కేఏ పాల్‌కు తొలిరౌండ్‌లో 34 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

Time: 09:39 AM
నాలుగో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. రౌండ్‌ రౌండ్‌కు ఆధిక్యం మారుతుంది.

Time: 09:39 AM
మూడు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో ఉంది. 1000 ఓట్లు పైగా ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది.

Time: 09:33 AM
మూడో రౌండ్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. రెండు రౌండు ముగిసే సరికి 563 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ ఉంది. మూడో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
టీఆర్‌ఎస్‌​- 14,211
బీజేపీ​-13,648
కాంగ్రెస్‌-2,100

Time: 09:25 AM
ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌
రెండు రౌండు ముగిసే సరికి 515 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ కొనసాగుతుంది.

Time: 09:19 AM
చౌటుప్పల్‌లో బీజేపీ ఆధిక్యం..
తొలిరౌండ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉండగా, రెండో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. చౌటుప్పల్‌ అర్బన్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది.

Time: 09:12 AM
రెండో రౌండ్‌ లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీ ముందంజలో ఉంది. 789 ఓట్లకుపైగా బీజేపీ ఆధిక్యంలో ఉంది.

Time: 09:01 AM
చౌటుప్పల్‌ మండలం జైకేసారంలో టీఆర్‌ఎస్‌ లీడ్‌లో ఉంది.
తొలిరౌండ్‌(14,553)
టీఆర్‌ఎస్‌- 6,478
బీజేపీ​- 5,126
కాంగ్రెస్‌​‍- 2,100

Time: 08:55 AM
1352 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌
ఈవీఎం తొలి రౌండ్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉంది. 1352 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్ ఉంది.

Time: 08:45 AM
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తి
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. టీఆర్‌ఎస్‌కు నాలుగు ఓట్ల ఆధిక్యం, టీఆర్‌ఎస్‌కు 228, బీజేపీ 224, బీఎస్పీ -10, ఇతరులకు 88 ఓట్లు పోల్‌ అయ్యాయి.  మొదటి రౌండ్ కౌంటింగ్‌ ప్రారంభమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. 

Time: 08:30 AM
టీఆర్‌ఎస్‌ ముందంజ..
పోస్టల్‌ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉంది. 2 టేబుళ్లపై 686 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు చేపట్టారు. పోస్టల్‌ బ్యాలెట్‌ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు

Time: 08:15 AM
పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు..
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. 2 టేబుళ్లపై 686 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు చేపట్టారు. పోస్టల్‌ బ్యాలెట్‌ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు.

Time: 08:07 AM
కౌంటింగ్‌ కోసం 23 టేబుళ్లు..
మునుగోడు కౌంటింగ్‌ కోసం 23 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కోసం 2 టేబుళ్లు కేటాయించారు. మిగిలిన 21 టేబుళ్లలపై ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు.

Time: 08:01 AM
కౌంటింగ్‌ ప్రారంభం
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రారంభమైంది. 15 రౌండ్లలో కౌంటింగ్‌ ముగియనుంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కిస్తున్నారు. తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కించనున్నారు. ముందుగా జైకేసారం, చివరగామహ్మదాపురం ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నానికల్లా విజేతపై స్పష్టత రానుంది. 

Time: 7:15 AM
కాసేపట్లో కౌంటింగ్‌..
కాసేపట్లో మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. 15 రౌండ్లలో కౌంటింగ్‌ ముగియనుంది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం వరకు పూర్తి కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం తేలిపోనుంది. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

1,2,3 రౌండ్లలో చౌటుప్పల్‌ మండలం ఓట్లు లెక్కింపు
4,5,6 రౌండల్లో నారాయణపురం మండలం ఓట్ల లెక్కింపు
7,8 రౌండ్లలో మునుగోడు మండలం ఓట్ల లెక్కింపు
9,10 రౌండ్లలో చండూరు మండలం ఓట్ల లెక్కింపు
11,12,13,14,15 రౌండ్లలో మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్‌ మండలాల ఓట్లు లెక్కింపు 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో వెలువడనుంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు బహిర్గతం కానుంది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం వరకు పూర్తి కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం తేలిపోనుంది. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపునకు జిల్లా ఎన్నికల అధికారి వినయ్‌ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

కౌంటింగ్‌ జరిగే విధానంపై సిబ్బందికి సాధారణ ఎన్నికల పరిశీలకులు పంకజ్‌ కుమార్‌ పలు సూచనలు చేశారు. నల్లగొండ ఆర్జాలబావిలోని గోదాముల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపు కోసం రెండు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 298 పోలింగ్‌ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలోని ఓట్ల›లెక్కింపు కోసం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదటగా చౌటుప్పల్‌ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. అందులో మొదటి పోలింగ్‌ బూత్‌ అయిన జైకేసారం ఓట్లతో పాటు ఆ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు.

చివరగా నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామం ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ట్రెండ్‌ తెలిసిపోనుంది. 2 –3 గంటల కల్లా ఎవరి భవితవ్యం ఏంటనేది తేలనుంది. మునుగోడు ప్రజల తీర్పు వెల్లడికానుంది. నియోజకవర్గంలో 2,41,855 ఓటర్లు ఉన్నారు. అందులో సర్వీసు ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ కలుపుకొని ఈ ఉప ఎన్నికల్లో 2,25,878 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 93.41 శాతం పోలింగ్‌ నమోదైంది. భారీ స్థాయిలో ఓట్లు పోలైన నేపథ్యంలో కౌంటింగ్‌కు  సంబంధించి ఎంత ఆలస్యం జరిగినా సాయంత్రం 4 గంటల వరకు ఫలితం వెల్లడి కానుంది.

టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ! 
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నాటి నుంచే అనధికారికంగా ప్రచారం మొ­ద­లైన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 3న ఎన్నికల షెడ్యూల్‌ జారీ అయినప్పటి నుంచి అధికారికంగా ప్రచారం కొనసాగింది. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నా­రు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి తమ పార్టీకి పట్టం కడతాయని టీఆర్‌ఎస్‌ విశ్వసిస్తుండగా ప్రజలకు తాను సేవ చేశానని, అలాగే యువతలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తనను గెలిపిస్తుందని రాజగోపాల్‌రెడ్డి భావిస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top