అందుకే నాపై దాడికి యత్నించారు: ఎంపీ నందిగం సురేష్‌

MP Nandigam Suresh Comments On TDP Activist Tries To Attack On Him - Sakshi

సాక్షి, గుంటూరు: పక్కా ప్రణాళికతోనే టీడీపీ కార్యకర్త బత్తుల పూర్ణచంద్రరావు మారణాయుధాలతో తనపై దాడికి యత్నించాడని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. దళిత వ్యక్తి ఎంపీగా ఎన్నికకావడాన్ని జీర్ణించుకోలేక, ఇప్పటికే తనపై ఐదుసార్లు దాడికి ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కేసు పెడితే గంటలో బయటకు వస్తా, కోర్టుకు వెళితే ఒక రోజులో బయటికి వస్తా’’ అంటూ పూర్ణచంద్రరావు మాట్లాడుతున్నారని, ఇదంతా ప్లాన్‌ ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. కాగా తుళ్లూరు డిఎస్పీ శ్రీనివాసులరెడ్డి, ఎంపీ సురేష్‌పై దాడికి యత్నించిన ఘటనాస్థలాన్ని పరిశీలించారు. (చదవండి: ఎంపీ నందిగం సురేష్‌పై దాడికి యత్నం)

ముక్తకంఠంతో ఖండిస్తున్నాం
ఎంపీ నందిగం సురేష్‌పై టీడీపీ కార్యకర్త దాడిని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయనను పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఇది హేయమైన చర్య ఒక దళిత వ్యక్తి ఎంపీ అయితే ఇంత అసూయ ఎందుకు? రాజధానిలో భూస్వాములే ఉండాలా? అని ప్రశ్నించారు. దళితులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top