
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మరోసారి మండిపడ్డారు. ఇప్పటివరకూ సీఎం రేవంత్.. జై తెలంగాణ అనే నినాదాన్నే పలకలేదని కవిత ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అని నినదించాలి అని డిమాండ్ చేశారు కవిత. తెలంగాణ ప్రజలపై రేవంత్ అక్కసు ఎందుకని ప్రశ్నించారు కవిత. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడిన కవిత.. రేవంత్ తెలంగాణ నినాదాన్ని ఇప్పటివరకూ పలకలేదన్నారు.

గోదావరి జలాలు శాశ్వతంగా తెలంగాణకు దూరం కాబోతున్నాయని కవిత పేర్కొన్నారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్.. కాళేశ్వర కమిషనా.. లేక కాంగ్రెస్ కమిషనా అనే అనుమానం ఉందన్నారు.

తెలంగాణ ప్రతి ఉద్యమంలో జాగృతి సంస్థ భాగమైందని, 18 ఏళ్ల క్రితమే జాగృతి సంస్థను స్థాపించామన్నారు. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో జాగృతి సంస్థను ఏర్పాటు చేశామన్నారు కవిత.
కవిత ఏమన్నారంటే..
తెలంగాణ సోయితో కేసీఆర్ పరిపాలన చేశారు. మన కర్మ ఇప్పుడు జై తెలంగాణ అనని సీఎం పరిపాలనలో ఉంది. జూన్2 న అయిన సీఎం జై తెలంగాణ అనాలి. అమర వీరులకు నివాళులు అర్పించాలి..అని డిమాండ్ చేస్తున్న. రాజీవ్ యువ వికాసం పేరుతో కార్యక్రమం ఉండకూడదు. రాజీవ్ తెలంగాణకు ఏం సంబంధం. తెలంగాణ వాదుల పేర్లు పెట్టాలి. తెలంగాణ కోసం అమరులైన శ్రీకాంత చారి లాంటి వారి పేరు పెట్టాలి. గోదావరి కావేరీ లింక్ పేరుతో గోదావరి నీరు తెలంగాణ కు దూరం కాబోతున్నాయి.
200 TMC నీళ్ల హక్కు కోసం cm మాట్లాడారు. నీళ్ళ హక్కుల కోసం పోరాటం చేయాలి..Kcr కు ఎందుకు నోటీసు లు ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ లేక కాంగ్రెస్ కమిషనా?, జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద జూన్ 4 న మహా ధర్నా చేపడుతున్నాం..కాంగ్రెస్ కాళేశ్వరం పై కుట్రలను ఎండగడుతున్నాం.. బిజెపి బీసీ బిల్లును డీ ఫ్రీజ్ లో పెట్టే ప్రయత్నం చేస్తే జాగృతి తరుపున మళ్ళీ పోరాటం చేస్తాం. విద్యార్థులు, మహిళల కోసం, మైనార్టీల కోసం ఇచిన హామీల అమలు కోసం పోరాటం చేస్తాం. కెసిఆర్‌కి బీఆర్‌ఎస్ ఒక కన్న అయితే మరో కన్ను జాగృతి.. బిజెపికి 8 ఎంపీల ఉంటే ఒక్క అంశం గురించి మాట్లాడారు.. బిజెపికి కాంగ్రెస్‌కి జాగృతి సత్తా ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తాం’ అని కవిత హెచ్చరించారు.