అధిక ధరలు.. నిషేధంలో భాగమే: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

Minister Srinivas Goud Gives Clarity on Liquor Rates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ధరలు తగ్గిస్తే మద్యం మామూలు వాళ్లకు అందుబాటులోకి వస్తుందని, ఇంకా ఎక్కువ తాగుతారని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. ధర తక్కువ పెడితే చాయ్‌కి బదులు మందు తాగడం ప్రారంభి స్తారని.. ఎక్కువ ధరలు పెడితే తాగకుండా ఇంటి ఖర్చుల గురించి ఆలోచిస్తారని పేర్కొన్నారు. అధిక ధరలు పెట్టడం నిషేధంలో ఒక భాగమన్నారు. శుక్రవారం శాసనసభలో ఎక్సైజ్‌ శాఖ పద్దులపై సభ్యులకు ప్రశ్నలకు శ్రీనివాస్‌గౌడ్‌ సమాధానమి చ్చారు. దేశవ్యాప్తంగా మద్య నిషేధం అమలు చేస్తే రాష్ట్రంలోనూ అమలు చేస్తామని కేసీఆర్‌ ఇప్పటికే చెప్పారని గుర్తుచేశారు. మద్యం ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభు త్వం అనుకోవడం లేదని.. అక్రమ మద్యాన్ని కట్టడి చేయడం వల్లే ఆదాయం పెరిగిందని చెప్పారు.

రైతుల తరహాలో గీత కార్మికులకూ బీమా..
గీత కార్మికుల సాధారణ మరణాలకు సైతం పరిహారం చెల్లించేందుకు రైతుబీమా తరహాలో కొత్త పథకాన్ని తెస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ఈ వర్గంవారి సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.100 కోట్లను కేటాయించినట్టు చెప్పారు. నెక్లెస్‌ రోడ్డులో రూ.12 కోట్లతో నీరా కేఫ్‌ను, భువనగిరి నందనవనంలో రూ.7 కోట్లతో నీరా ఉత్పత్తుల సంస్థను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గీత కార్మికుల కోసం చెట్లు ఎక్కే యంత్రాలను అందు బాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 10, 15 అడుగులే ఉండే తాటి చెట్లను అభివృద్ధి చేయాలని వ్యవసాయ శాఖను కోరామన్నారు.

జనాన్ని మద్యానికి బానిస చేస్తున్నారు: భట్టి
రాష్ట్ర ప్రభుత్వం మద్యం ద్వారా రూ.37వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకోవడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలను తాగుడుకు భయంక రంగా అలవాటు చేస్తోందని, బానిసలుగా మార్చు తోందని మండిపడ్డారు. కల్తీ కల్లు, డ్రగ్స్‌ను కట్టడి చేయాలని డిమాండ్‌ చేశారు. గీత కార్మికులకు 45 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఎప్పటి నుంచి ఇస్తారో తెలపాలని కోరారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top