గిరిజనులపై ప్రధానిది కపట ప్రేమ మంత్రి సత్యవతి రాథోడ్‌    | Sakshi
Sakshi News home page

గిరిజనులపై ప్రధానిది కపట ప్రేమ మంత్రి సత్యవతి రాథోడ్‌   

Published Mon, Oct 2 2023 2:37 AM

Minister Satyavati Rathore Comment on PM Narendra Modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గిరిజనులపై ప్రధాని మోదీ కపటప్రేమ ప్రదర్శిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆగ్ర హం వ్యక్తం చేశారు. పదేళ్లుగా గిరిజన వర్సిటీని తొక్కిపెట్టింది మోదీ ప్రభుత్వమే అని, దీంతో ఎంతో మంది ఉన్నత చదువుల కోసం దూరప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

ఎన్నికలు ముంచుకొస్తున్నందునే మోదీకి గిరిజన వర్సిటీ గుర్తొచ్చిందన్నారు. ఈ వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా జాకారంలో 335 ఎకరాలను ఇప్పటికే కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా కేంద్రం స్పందించలేదన్నారు.   

Advertisement
Advertisement