గవర్నర్‌ తమిళిసైతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ

Minister Sabitha Indra Reddy Meets Governor at Raj Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో గురువారం భేటీ అయ్యారు. ఉమ్మడి నియామక బోర్డు బిల్లు ఆమోదంపై విద్యాశాఖ మంత్రి రాజ్‌భవన్‌కు వచ్చి చర్చించాలని గరవ్నర్‌ సూచించడంతో సబితా ఇంద్రారెడ్డి తమిళసైతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రితోపాటు విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్‌ బోర్డుపై  గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై మంత్రి వివరణ ఇచ్చారు. ఉమ్మడి నియామక బోర్డుపై గవర్నర్ సందేహాలను నివృత్తి  చేశారు. న్యాయపరమైన చిక్కులు రాకూడదనేదే తన విధానమని గవర్నర్‌ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి నియామక బోర్డు ద్వారా నియామకాలు త్వరగా జరగాలనేదే తన అభిమతమని తెలిపారు. అయితే నిబంధనలు అన్ని పూర్తి స్థాయిలో పాటిస్తున్నమని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి సబితా తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top