ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్‌..  | Minister Malla Reddy Interesting Comments On IT Raids | Sakshi
Sakshi News home page

ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్‌.. 

Dec 17 2022 12:02 AM | Updated on Dec 17 2022 8:32 AM

Minister Malla Reddy Interesting Comments On IT Raids - Sakshi

మేడ్చల్‌ రూరల్‌: దేశంలో అతిపెద్ద ఐటీ దాడి తనపైనే జరిగిందని, అది కూడా రికార్డేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్‌ గ్రూప్స్‌ ఆడిటోరియంలో శుక్రవారం అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. తనపై ఇటీవల జరిగిన ఐటీ దాడి మూడోసారి కావడంతో.. హ్యాట్రిక్‌గా భావిస్తున్నానని పేర్కొన్నారు. తాను పాల వ్యాపారం నుండి మంత్రి స్థాయికి ఎదిగానని.. అందుకు ఎంతో కష్టపడ్డానని చెప్పుకున్నారు. తన విద్యాసంస్థల్లో పదివేల మంది అధ్యాపకులు, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వివరించారు. మనం ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చని.. అందుకు డిగ్రీలు అవసరం లేదని.. లక్ష్యం ఉంటే చాలని మంత్రి మల్లారెడ్డి ఉద్బోధించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement