
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ అధికారులు.. సోదాలు చేపట్టారు. ప్రముఖ బంగారం షాపు యాజమానుల ఇళ్లలో బుధవారం ఉదయం నుంచి ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. బంగారం కొనుగోలులో ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. దీంతో, 15 బృందాలు రంగంలోకి దిగి.. సోదాలు చేస్తున్నారు. అటు.. వరంగల్‌లో సైతం తనిఖీలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.