ఎంత దుర్మార్గం.. నీతి ఆయోగ్‌ చెప్పినా పైసా ఇవ్వలేదు.. కేంద్రంపై కేటీఆర్‌ గరం

Minister KTR Slams Modi Government Telangana State Development Hyd - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. నీతి ఆయోగ్ చెప్పినా  తెలంగాణ రాష్ట్రానికి మోదీ స‌ర్కార్ న‌యా పైసా ఇవ్వ‌లేదని దుయ్యబట్టారు. విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ఏ ఒక్క హామీని కేంద్రం నెర‌వేర్చ‌లేదని చెప్పుకొచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వానికి ఎన్నో అంశాల్లో మ‌ద్ద‌తు ఇచ్చామని తెలిపారు.

కేంద్రానికి మ‌నం రూపాయి ఇస్తే 46 పైస‌లు మాత్ర‌మే తిరిగి వ‌స్తున్నాయని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామ‌కాలు ల‌క్ష్యంగా తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన‌ అభ‌య్ త్రిపాఠి స్మార‌క ఉప‌న్యాసం కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ పాల్గొని కొత్త రాష్ట్రం – స‌వాళ్లు అనే అంశంపై ప్ర‌సంగించారు.

బోర్లు ఎక్కువ, అందుకే 24 గంటలు అవసరం
కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘1950 నుంచి 2014 వ‌ర‌కు దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్ప‌డ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్పుడు ఎన్నో స‌వాళ్లు, సందేహాలు ఉండే. తెలంగాణ ఏర్ప‌డితే ఇక్క‌డ ఇత‌ర ప్రాంతాల వారి భ‌ద్ర‌త‌పై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌శాంతంగా జీవ‌నం సాగిస్తున్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడే కేసీఆర్ ప్ర‌తి ఇంటికి తాగునీరు అందించారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం అమ‌లు చేశాం. రాష్ట్రంలో 30 ల‌క్ష‌ల‌కు పైగా వ్య‌వ‌సాయ బోర్లు ఉన్నాయి. కాబ‌ట్టి క‌రెంట్ ఎక్కుక అవ‌స‌రం ప‌డుతుంది. 
వ్య‌వ‌సాయానికి నాణ్య‌మైన 24 గంట‌ల విద్యుత్‌ను ఉచితంగా అంద‌జేస్తున్నాం.

కాళేశ్వ‌రంతో ఉత్త‌ర తెలంగాణ స‌స్య‌శ్యామ‌లమైంది. ప్ర‌పంచంలోనే లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు కాళేశ్వ‌రం. వ‌రి ధాన్యం ఉత్ప‌త్తిలో తెలంగాణ దేశంలోనే అగ్ర‌స్థానంలో నిలిచింది.  ఐటీ సెక్టార్‌లో ఉద్యోగాల క‌ల్ప‌న‌లో రెండేళ్లుగా బెంగ‌ళూరును హైద‌రాబాద్ దాటేసింది’ అని కేటీఆర్‌పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top