Ts Assembly: కూనంనేనికి హరీశ్‌రావు ఛాలెంజ్‌ | Minister Harishrao Comments At Telangana Assembly | Sakshi
Sakshi News home page

కూనంనేనికి హరీశ్‌రావు ఛాలెంజ్‌

Dec 16 2023 3:04 PM | Updated on Dec 16 2023 5:54 PM

Minister Harishrao Comments At Telangana Assembly - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: అసెంబ్లీలో గవర్నర్‌ స్పీచ్‌కు ధన్యవాదాలు తెలిపె తీర్మానంపై చర్చ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు.

సీఎం కేసీఆర్‌ లాంటి అన్నీ తెలిసిన నాయకుడు కూడా అమలు సాధ్యంకానీ ఇంటికో ఉద్యోగం, డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, దళితబంధు హామీలిచ్చారన్నారు. ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. 

తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎక్కడా చెప్పలేదని హరీశ్‌రావు అన్నారు. ‘కూనంనేని సాంబశివరావు సీపీఐ ఎమ్మెల్యే. వారి పార్టీ కాంగగ్రెస్‌కు మిత్ర పక్షం. ఇద్దరు కలిసి పోటీ చేశారు. మేం ఇంటికి ఒక ఉద్యోగమిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు.

తాము అలా చెప్పినట్లు నిరూపించాలని ఛాలెంజ్‌ విసిరారు. గవర్నర్‌ స్పీచ్‌పై కూనంనేని మాట్లాడితే బాగుంటుంది’అని హరీశ్‌రావు సూచించారు.అనంతరం కూనంనేని మళ్లీ మాట్లడడం ప్రారంభించిన తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ సభ్యులు అభ్యంతరం తెలిపారు.

ఇదీచదవండి..కాంగ్రెస్‌ పార్టీకి ఇంత మిడిసిపాటు వద్దు: కేటీఆర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement