Botsa Satyanarayana: వారసులు అందరికీ ఉంటారు.. కానీ ఆమోదించాల్సింది వారే..

Minister Botsa Satyanarayana Comments Over Gadapa Gadapaku Workshop - Sakshi

సాక్షి, విజయవాడ: రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యమైనా గెలుపేనని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లో చెప్పారన్నారు.

ఈ మేరకు మంత్రి బొత్స మాట్లాడుతూ.. 'వారసులు అందరికీ ఉంటారు, నాకూ మా అబ్బాయి ఉన్నాడు.. మా వాడు వైద్య రంగం వైపు వెళ్లాడు. ఎవరైనా వారసుల్ని దింపొచ్చు, కానీ ప్రజలు ఆమోదించాలి. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 గెలవాలనుకోవటం అత్యాశ కాదు. ఒక్క స్థానం పోయినా పర్వాలేదు అనుకుంటే ఆ సంఖ్య క్షేత్రస్థాయిలో పది అవుతుంది. శాశ్వత అధ్యక్షుడి ఎన్నికపై నాకు సమాచారం లేదు. మా పార్టీ విషయాలు మేం మాట్లాడుకుంటాం. శాఖాపరమైన సమీక్షలు జరిపినట్లే పార్టీ పరంగా సీఎం ఎమ్మెల్యేల పనితీరు సమీక్షించి లోటుపాట్లు చెప్పారు' అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. 

చదవండి: (టీడీపీలో ఆధిపత్య పోరు.. అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top