మమతా మ్యాజిక్‌:  బీజేపీ ప్రధాన కార్యదర్శి స్పందన

Mamata Behind TMC's Astounding Performance, BJP Will Have to Introspect: Vijayvargiya - Sakshi

ఆత్మపరిశీలన చేసుకుంటాం:  కైలాష్ విజయ్‌ వర్గియా

బీజేపీ ఎంపీలు ఓడిపోవడం షాకిచ్చింది, ఇది మమత విజయం

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌ వర్గియా స్పందించారు. ఈ విజయం పూర్తిగా మమతా బెనర్జీ వల్లే సాధ్యమైందని అన్నారు. దీనిపై తాము ఆత్మ పరిశీలన చేసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు దీదీకే పట్టం కట్టారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆమెనే సీఎం కావాలని కోరుకున్నారన్నారు. బెంగాల్‌ ఎన్నికల్లోతమ పార్టీ వైఖరి, వైఫ్యల్యం నేపథ్యంలో తప్పు  ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ఫలితాల తీరుపై ఆరా తీసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి తనకు పిలుపు వచ్చిందని కైలాష్  తెలిపారు. అలాగే బీజీపీ ఎంపీలు బాబుల్ సుప్రియో, లాకెట్ ఛటర్జీ వెనుకంజలో ఉండటం చూసి తాను షాక్ అయ్యానని పేర్కొన్నారు. సంస్థాగత సమస్యలా, లేక ఇన్‌సైడర్‌, ఔట్‌సైడర్ చర్చ వల్లా అన్నది చూడాలి. కాగా రాష్ట్రంలోని 292 నియోజకవర్గాలలో 201  స్థానాల్లో అధిక్యాన్ని ప్రదర్శిస్తూ  బెంగాల్‌లో మరోసారి పగ్గాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. అటు బీజేపీ 82 స్థానాల్లో లీడింగ్‌ లో ఉంది. మరోవైపు తీవ్ర ఉత్కంఠను రాజేసీన నందీగ్రామ్‌లో చివరికి మమత  1200 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం విశేషం.

చదవండి : మోదీకి షాకిచ్చిన దీదీ: వైరలవుతున్న మీమ్స్‌
వ్యూహకర్తగా తప్పుకుంటున్నా, విశ్రాంతి కావాలి: ప్రశాంత్‌ కిశోర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top