ఇంజినీర్ చెంప చెల్లుమనిపించిన మహిళా ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

Maharashtra MLA Slaps Abuses Civic Engineer - Sakshi

మహారాష్ట్ర: మహారాష్ట్రకు చెందిన మహిళా ఎమ్మెల్యే ఓ  సివిల్ ఇంజినీర్‌పై చేయి చేసుకున్నారు. అందరూ చూస్తుండగానే అధికారి చెంప చెల్లుమనిపించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. నిర్మాణాలను కూల్చివేసిన ఘటనలో ఎమ్మెల్యే ఫైర్ అయినట్లు తెలుస్తోంది. థాణే జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా జైన్. అయితే.. భయందర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కొన్ని నిర్మాణాలను కూల్చివేసిన వ్యవహారంలో సివిల్ ఇంజినీర్‌ను ఆమె ప్రశ్నించారు. అధికారులను బూతులు తిడుతూ కోపగించుకున్నారు . నిర్మాణాలను కూల్చివేసిన కారణంగా పిల్లలతో సహా నిర్వాసితులు రానున‍్న వర్షాకాలంలో రోడ్లపైనే ఉండాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ క్రమంలో అధికారులు చెప్పిన సమాధానానికి సంతృప్తి చెందని ఎమ్మెల్యే.. అధికారి చెంప చెల్లుమనిపించారు. 

భయందర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు బీజేపీ తరుపున మాజీ మేయర్‌గా గీతా జైన్‌ పనిచేశారు.  2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీ-శివసేన ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారు.

ఇదీ చదవండి: మమత ప్రభుత్వానికి షాక్..! కేంద్ర బలగాల మోహరింపుపై సుప్రీం ఓకే..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top