తెలంగాణ కాంగ్రెస్‌కు‌ భారీ షాక్ | Kuna Srisailam Goud Quits Congress Party | Sakshi
Sakshi News home page

తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. కీలక నేత రాజీనామా

Feb 21 2021 11:30 AM | Updated on Feb 21 2021 7:31 PM

Kuna Srisailam Goud Quits Congress Party - Sakshi

మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్‌ డీసీసీ ప్రెసిడెంట్ కూన‌ శ్రీశైలం గౌడ్‌ కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పారు.

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్‌ డీసీసీ ప్రెసిడెంట్ కూన‌ శ్రీశైలం గౌడ్‌ కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పారు. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు ఆదివారం ప్రకటించారు. పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఆరేళ్లుగా కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని, ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల సమస్యలపై పోరాటంలో పార్టీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

త్వరలో ఆయన ఢిల్లీకి వెళ్లి పెద్దల సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీశైలం గౌడ్‌ కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చెందారు. కాగా, ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి విజయశాంతి, ఇతర కీలక నేతలు బయటకు వచ్చి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. 

చదవండి:
ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు: భట్టి

ఓటమి పాఠం: వ్యూహం మార్చిన కవిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement