కేసీఆర్‌ను గద్దెదించుతాం: కోమటిరెడ్డి | Komatireddy Venkat Reddy Slams On KCR And TRS Over LRS | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను గద్దెదించుతాం: కోమటిరెడ్డి

Dec 30 2020 12:12 PM | Updated on Dec 30 2020 12:12 PM

Komatireddy Venkat Reddy Slams On KCR And TRS Over LRS - Sakshi

కేసీఆర్ పాలనను అంతమొందిస్తామని, కేసీఆర్ నిర్ణయలు చూస్తే పిచ్చి తుగ్లక్ ఉంటే పిచ్చి తుగ్లక్‌కే పిచ్చి వచ్చేదని మండిపడ్డారు.

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని రాష్ట్రాన్ని పాలించాలని, ప్రజలను ఇబ్బందులు పెడుతే చూస్తూ ఉరుకొమని, గాడిల పాలనను బద్దలు కొడుతామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మండిపడ్డారు. ఇకనైనా పిచ్చి తుగ్లక్ పాలనకు స్వస్తి పలకాలని బుధవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌పైన ప్రజల పక్షాన కోర్టులో ఫీల్ దాఖలు చేశానని, ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు కోసం న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేసే వరకు పోరాటం చేస్తుందని తెలిపారు. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం కాదు శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల దగ్గర ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో డబ్బులు వసూలు చేయడం నీకు(కేసీఆర్‌) సిగ్గు అనిపించడం లేదా? అని మండిపడ్డారు. శ్వాశతంగా ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చెయాలి లేకపోతే కేసీఆర్‌, టీఆర్ఎస్‌ను శాశ్వంతంగా ప్రజలు రద్దు చేస్తారని అన్నారు. భవిష్యత్తులో ఎవరు ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టవద్దన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమాలు, పోరాటాలతో టీఆర్ఎస్ ప్రభుత్వాని ఉక్కిరిబిక్కిరి చేస్తామన్నారు.

కేసీఆర్ పాలనను అంతమొందిస్తామని, కేసీఆర్ నిర్ణయలు చూస్తే పిచ్చి తుగ్లక్ ఉంటే పిచ్చి తుగ్లక్‌కే పిచ్చి వచ్చేదని మండిపడ్డారు. కొత్త రిజిస్ట్రేషన్లు అని దాన్ని వెనక్కి తీసుకొని మళ్లీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నావని ఫైర్‌ అయ్యారు. మూడు నెలలు రిజిస్ట్రేషన్ల్ అపీ ప్రజలను ఇబ్బంది పెట్టవని విరుచుకుపడ్డారు. నియంత్రణ వ్యవసాయం అని మళ్లీ రద్దు చేశామని, కేసీఆర్‌ నిర్ణయలను చూసి ప్రజలు చిత్కరించుకుంటున్నారని అన్నారు. బుర్ర దగ్గర పెట్టుకొని నిర్ణయాలు తీసుకో అని హితవు పలికారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఉద్యోగులపైన ప్రేమ పుట్టుకచ్చిందా? అని సూటిగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలలోపే ఉద్యోగులకు వేతనాల పెంపు, వయో పరిమితి పెంపు, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. 

నిరుద్యోగ భృతి ఇవ్వాలి
పీఆర్సీ  కోసం ఎన్నిసార్లు కమిటీలు వేస్తావు, ఇక కేసీఆర్‌ అబద్దాలకు స్వస్తి పలకాలన్నారు. రైతులకు ఉచిత ఎరువులు అని రైతులకు శుభవార్త వారం రోజుల్లో చెబుతానన్నది ఏం అయిందని ప్రశ్నించారు. సకల జనులను ఏకం చేసి తెలంగాణ కోసం చేసిన ఉద్యమం కంటేని పెద్ద ఉద్యమం చేస్తామని కేసీఆర్ నియంత పాలనకు చరమగితం పాడుతామని, కేసీఆర్‌ను గద్దెదించుతామని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement