Komatireddy RajGopal Reddy Challenges To KTR Over Contract - Sakshi
Sakshi News home page

మంత్రి కేటీఆర్‌కు కోమటిరెడ్డి సవాల్‌.. దమ్ముంటే నిరూపించండి అంటూ..

Mar 10 2023 11:56 AM | Updated on Mar 10 2023 12:26 PM

Komatireddy Raj Gopal Reddy Challenges To KTR Over Contract - Sakshi

తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం వర్సెస్‌ బీజేపీ నేతలు అన్నట్టుగా పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల సందర్బంగా రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక, మునుగోడు ఉప ఎన్నికల​ సందర్భంగా ఇది పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. ఉప ఎన్నికల అనంతరం, కేసీఆర్‌ సర్కార్‌పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. 

మరోవైపు.. తాజాగా మంత్రి కేటీఆర్‌కు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. బీజేపీలో చేరినందుకు కాంట్రాక్ట​్‌ తీసుకున్ననని నాపై ఆరోపణలు చేశారు. ఆ 18వేల కోట్ల కాంట్రాక్ట్‌ నిరూపించండి. గోబెల్స్‌ ప్రచారం నాపై పనిచేస్తుందని భావించకండి అంటూ ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేశారు. 

అయితే, మునుగోడు ఉప ఎన్నికల సందర్బంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. 18వేల కోట్ల కాంట్రాక్ట్‌ కోసమే బీజేపీలో చేరారు అంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపణలు చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని హైలైట్‌ చేశారు. ఈ క్రమంలో దీనిపై కోమటిరెడ్డి అప్పుడే క్లారిటీ ఇచ్చారు. 


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement