‘నా టికెట్‌ను తన్నుకుపోయారు’.. కిమిడి నాగార్జున కన్నీళ్లు | Kimidi Nagarjuna Comments On Kala Venkata Rao | Sakshi
Sakshi News home page

‘నా టికెట్‌ను తన్నుకుపోయారు’.. కిమిడి నాగార్జున కన్నీళ్లు

Mar 30 2024 4:06 PM | Updated on Mar 30 2024 6:03 PM

Kimidi Nagarjuna Comments On Kala Venkata Rao - Sakshi

 చీపురుపల్లి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి.

సాక్షి, విజయనగరం: చీపురుపల్లి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. చీపురుపల్లి టికెట్‌ ఆశించి కిమిడి నాగార్జున భంగపడ్డారు. పెద్దనాన్న కళా వెంకట్రావుకు చాలా అవకాశాలు ఉన్నాయని.. అయిన సరే తన టికెట్‌ను తన్నుకుపోయారంటూ చీపురుపల్లి క్యాడర్‌ వద్ద కన్నీటి పర్యంతం అయ్యారు. తన జీవితం చెడిందని.. యువత ఎవరూ రాజకీయాల్లోకి రావద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు మాటలు నమ్మి విదేశాల్లో ఉద్యోగం వదులుకొని వచ్చేసి 2019 ఎన్నికల్లో పోటీచేసిన కళా వెంకటరావు సోదరుడి కుమారుడు నాగార్జునకు ఓటమి తప్పలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో తుడిచిపెట్టుకుపోయింది. అలాంటి పరిస్థితుల్లో జిల్లాలో పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి సీనియర్‌ నాయకుడు అశోక్‌ గజపతిరాజు సహా ఎవ్వరూ ముందుకురాన్నప్పుడు నాగార్జున భుజానికెత్తుకున్నారు.

ఐదేళ్లూ అడపాదడపా కార్యక్రమాలతో టీడీపీ ఉనికి చాటుతూ వచ్చారు. ఈసారి చీపురుపల్లి నుంచి పోటీచేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చంద్రబాబు ఆయన్ను కరివేపాకులా తీసిపడేశారు. తనను నమ్మించి గొంతు కోశారని, నిలువునా మోసం చేశారని నాగార్జున లబోదిబోమంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement