కేశవ్‌ పద్దు.. హామీల రద్దు | - | Sakshi
Sakshi News home page

కేశవ్‌ పద్దు.. హామీల రద్దు

Feb 15 2026 12:41 PM | Updated on Feb 15 2026 12:41 PM

కేశవ్

కేశవ్‌ పద్దు.. హామీల రద్దు

● ఏపీ బడ్జెట్‌లో జిల్లాకు రిక్తహస్తం ● ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై చిన్నచూపు

● కానరాని విద్య, ఉద్యోగ, కార్మిక, కర్షక సంక్షేమం

● ఆవేదనలో ఉద్యోగ సంఘాలు ● అన్నదాత సుఖీభవకు అత్తెసర నిధులు

● ఎన్నికల హామీల అమలుకు ఎసరు

సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్ర బడ్జెట్‌లో విజయనగరం జిల్లాకు మరోసారి రిక్తహస్తమే కనిపించింది. నిధుల సాధనలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసనసభలో శనివారం ప్రవేశపెట్టిన రాష్ట్రపద్దులో జిల్లాకు ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదని జిల్లా ప్రజలు పెదవి విరిస్తున్నారు. మొత్తంగా విదిల్చిన గంపగుత్త నిధులే తప్ప.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్నీ నెరవేర్చే పరిస్థితి ఉండబోదని మరోసారి స్పష్టమైంది. వ్యవసాయానికి వెన్నెముకలా నిలవాల్సిన తోటపల్లికి అరకొర కేటాయింపులే చేశారు. ఆ మొత్తం ఎటూచాలదని, సిబ్బంది జీతభత్యాలకూ సరిపోవని రైతు సంఘం నాయకులు అంటున్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రాజెక్టులు, వంతెనల విషయంలో ఒక్కదాని ప్రస్తావన కూడా బడ్జెట్‌లో లేకపోవడం గమనార్హం.

● నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకు పెన్షన్‌, ప్రభుత్వాస్పత్రి మిగులు పనులు పూర్తి, తదితర వాటి విషయంలో మొండిచేయి చూపారు. కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుని ప్రకటించిన బడ్జెట్‌లో అన్నీ అప్పుల కుప్పలు ఉన్నాయే తప్ప వాస్తవాలు ఏమీ కనిపించడం లేదు. ఉత్తరాంధ్ర అంటేనే వెనుకబాటు.. పేదరికానికి కేరాఫ్‌ అని పేరున్నా... బడ్జెట్‌లోనూ అదే వెనుకబాటు చూపారంటూ మేధావి వర్గం విమర్శిస్తోంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న తారకరామ తీర్థసాగర్‌, తోటపల్లి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులకు తూతూ మంత్రంగా నిధులు విడుదల చేశామని బడ్జట్లో కొన్ని అంకెలు పేర్చేసి ఊరుకున్నారు. ఇలాగైతే ఈ ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయి... ఇక్కడ పొలాలకు నీళ్లు ఎప్పుడు వస్తాయి..సేద్యం ఎప్పుడు చేయాలి.. కడుపులు ఎలా నిండాలి అంటూ సన్న,చిన్నకారు రైతులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.

● తోటపల్లి ప్రాజెక్టుకు అరకొర నిధుల కేటాయింపుతో పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. 2024–25లో కేవలం రూ.21.08 కోట్లు కేటాయించగా, 2025–26లో రూ.47.89 కేటాయించారు. ఈ నిధులు ఎటూ చాలకపోగా ఫిబ్ర వరి, మార్చి నెలలో అంచనాలు మారుతాయా యని మరో రూ.10.52 కోట్లు ఇచ్చారు. ఇందులో ఎంత ఖర్చువుతుందో తెలియదు. తాజాగా 2026–27 బడ్జెట్‌లో రూ.47.08 కోట్లు ఇచ్చారు. ప్రాజెక్టు పరిధిలో లైనింగ్‌ పనులు, గజపతినగరం బ్రాంచి కెనాల్‌ పనులు, పిల్ల కాలువల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నిధులతో ఇందులో 5 శాతం పనులు కూడా పూర్తి కాకపోవచ్చు. దీంతో ప్రాజెక్టు ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.

బడ్జెట్‌లో తారకరారమ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు చూస్తే పనులు ఎంతవరకు పూర్తవుతాయో ఆ తారకరామునికి తెలియాలి. ఈ ప్రాజెక్టుకు గత మూడు బడ్జెట్‌ల్లో నిధులు అరకొరగా ఉన్నాయి. 2024–25లో రూ.23.03కోట్లు కేటాయిస్తే 2025– 26లో రూ.68.00 కేటాయించారు. ఆర్థిక సంవత్సరం ఇంకా రెండు నెలలు ఉండడంతో అంచనాలు సవరిస్తూ మరో రూ.రూ.13.01 కేటాయించారు. ఈ నిధులతో ఏ మేరకు పనులు జరుగుతాయో ప్రజాప్రతినిధులకే తెలియాలి.

● పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు నీరు ఇచ్చే ఉత్తరాంధ్ర ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందన్నది బడ్జెట్‌కే ఎరుక. 2024–25తో రూ.40.47కోట్లు, 2025–26లో రూ.605.75కోట్లు కేటాయించారు. ఈ ఏడాది సవరణ కింద రూ.99.66కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌లో రూ.605.75కోట్లు కేటాయించారు. భూసేకరణ, కాలువ పనులన్నీ పెండింగ్‌లో ఉన్నాయని, నిధులు ఎటూ చాలవని రైతులు చెబుతున్నారు.

పొలానికి నీరు తోడుతున్న రైతు

ఊరిబడి ఊసేలేదు..

అన్నదాత సుఖీభవకు అరకొర నిధులు

విజయనగరం ఫోర్ట్‌: అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రం ప్రభుత్వం ఇచ్చే నిధులతో సంబంధం లేకుండా ఏడాదికి రూ. 20 వేలు సాయం అందిస్తామని సీఎం చంద్రబాబుతో సహా, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, నేతలు ఎన్నికల సభల్లో ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అన్నదాత సుఖీభవ సాయం ఎగ్టొట్టేశారు. రెండో ఏడాది ఇచ్చే అన్నదాత సుఖీభవ పథకంలో మూడో విడత సాయం ఇంతవరకు ఇవ్వలేదు. ప్రస్తుత బడ్జెట్‌ కేటాయింపులో రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించారు. రైతుకు రూ.20 వేలు చొప్పన రూ.46.86 లక్షల మందికి అని చెప్పారు. ఈ లెక్కన చూసినా రూ.9,372 కోట్లు అవసరం. రూ.2,772 కోట్లు చాలదు. ఏటా రైతుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఈ లెక్కన బడ్జెట్‌లో నిధులు కేటాయింపులు పెంచాలి. అయితే, తగ్గించడంతో ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో 2.74 లక్షల మంది రైతులు

జిల్లాలో 2.74 లక్షల మంది రైతులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద సాయం అందించేంది. చంద్రబాబు సర్కార్‌ మాత్రం 2.27 లక్షల మంది రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ సాయం అందించింది. వీరికి ఒక్కొక్కరికి రూ. 20 వేలు చొప్పున రూ.454 కోట్లు అవసరం. 2.74 లక్షల మందికి అయితే రూ.548 కోట్లు అవసరం. జిల్లాలోని 13,635 మంది కౌలు రైతులకు సాయం అందిస్తే సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ బడ్జెట్‌ చూస్తే మరింత మందికి కోతవేస్తారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

‘తారకరాముని’కే తెలియాలి...

నిధుల సాధనలో ఎమ్మెల్యేలు విఫలం

ఉద్యోగులపై నిర్లక్ష్యం తగదు

బడ్జెట్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావించకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ఆర్థిక బకాయిల చెల్లింపుల కోసం ఎటువంటి ప్రత్యేక నిధుల కేటాయింపుల చేయకపోవడం గమనార్హం. 12వ వేతన సంఘం నియామకం, మధ్యంతర భృతి మంజూరుపై ఎటువంటి ప్రస్తావన లేకపోవడం ఉద్యోగ వర్గాలను నిరాశకు గురిచేసింది. ఆర్థిక హక్కులు, సంక్షేమ అంశాలు ప్రస్తావన బడ్జెట్లో లేవు.

– డి.ఈశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి, ఏపీటీఎఫ్‌

హామీలు నెరవేరని బడ్జెట్‌

ఉద్యోగ, ఉపాధ్యాయుల ఎన్నికల హామీలను నెరవేర్చనిదిగా తాజా బడ్జెట్‌ ఉంది. యువగళం పాదయాత్రలో ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చారు. ఇంతవరకు పీఆర్‌సీ కమిషన్‌ ఏర్పాటు, మధ్యంతర భృతి ప్రకటన, పెండింగ్‌ డీఏ విడుదల వంటి అంశాలు బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం నిరాశ కలిగించింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.34వేల కోట్ల బకాయిల విడుదలపై కూడా స్పష్టత లేకోవడం ఆందోళకరం. డీఎస్సీ పరీక్షలకు సంబంధించి అవసరమైన నిధుల కేటాయింపులు బడ్జెట్‌లో కనిపించలేదు.

– డి.శ్యామ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ

రాష్ట్ర బడ్జెట్‌లో విజయనగరం జిల్లాకు తగిన నిధుల సాధనలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు విఫలమయ్యారు. ప్రజలు నమ్మ కంతో ఎన్నుకున్న ప్రతినిధులు జిల్లా ప్రయోజనాల విషయంలో నోరు మెదపకపోవడం దురదృష్టకరం. ఇది రాజకీయ వైఫల్యం మాత్రమే కాదు. ప్రజల నమ్మకానికి విరుద్ధం. వ్యవసాయం, కౌలు రైతుల సమస్యలు, మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణ, పెండింగ్‌ నీటి ప్రాజెక్టులు వంటి కీలక అంశాలు బడ్జెట్‌లో ప్రతిఫలించకపోవడం నిరాశ కలిగించింది. ప్రభుత్వ కేన్సర్‌ ఆస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడం శోచనీయం.

– బుగత అశోక్‌, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి

ఉపాధ్యాయులకు

నిరాశ కలిగించిన బడ్జెట్‌

రాష్ట్ర విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయ వర్గం పునాది. వారి సంక్షేమం, ఆర్థిక భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. తాజాగా విడుదల చేసిన వార్షిక బడ్జెట్‌లో ఉపాధ్యాయుల ఆర్థిక హక్కులపై దృష్టి సారించపోవడం అన్యాయం. ఉద్యోగ, ఉపాధ్యా యులకు రావలసిన పెండింగ్‌ ఆర్థిక బకాయిల చెల్లింపునకు స్పష్టమైన నిధుల కేటాయింపు లేకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.

– ఇజ్జురోతు రామునాయుడు,

రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం

అరకొర నిధులతో పనులు పూర్తికావు

తారకరామ ప్రాజెక్టు పనులు సాగుతూనే ఉన్నాయి. ఏ ఏడాది బడ్జెట్‌లోనూ పూర్తిస్థాయిలో నిధులు కేటాయించడంలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో మరింత ఘోరం. ఇప్పుడూ అలాగే చేశారు. మా తరం తర్వాత తరం నాటికై నా ప్రాజెక్టు పూర్తిచేస్తే మంచిందే.

– గుజ్జి సురేష్‌, రైతు

రైతులు నష్టపోతారు

చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ సాయం మొదటి ఏడాది ఇవ్వలేదు. ఏటా పథక లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నా ఆ మేరకు నిధుల కేటాయింపు లేదు. అరకొర కేటాయింపుల వల్ల రైతులు నష్టపోతారు. – బుద్దరాజు రాంబాబు,

రైతు సంఘం జిల్లా కార్యదర్శి

విజయనగరం అర్బన్‌: పాఠశాలలకు కొత్త భవనాల నిర్మాణంపై బడ్జెట్‌లో స్పష్టత లేదు. డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ విస్తరణకు ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ కనిపించలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లోటుపై ప్రత్యేక నిధుల ప్రస్తావన లేదు. నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్యా విస్తరణపై కొత్తదిశ స్పష్టంగా లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఖాళీల భర్తీపై టైమ్‌లైన్‌లేదు. డీఏ బకాయిల చెల్లింపులపై స్పష్టత ఇవ్వలేదని, పదోన్నతులు ప్రక్రియపై ప్రస్తావనే లేదని, కాంట్రాక్ట్‌ విధానం కొనసాగింపు వంటి ప్రధాన అంశాలపై ఎలాంటి కేటాయింపులు లేకపోవడం ఉద్యోగవర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్త నియామకాల కంటే ఖర్చు నియంత్రణకే ప్రాధాన్యత ఇవ్వడం కనిపించిందని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల విమర్శిస్తున్నాయి.

కేశవ్‌ పద్దు.. హామీల రద్దు 1
1/8

కేశవ్‌ పద్దు.. హామీల రద్దు

కేశవ్‌ పద్దు.. హామీల రద్దు 2
2/8

కేశవ్‌ పద్దు.. హామీల రద్దు

కేశవ్‌ పద్దు.. హామీల రద్దు 3
3/8

కేశవ్‌ పద్దు.. హామీల రద్దు

కేశవ్‌ పద్దు.. హామీల రద్దు 4
4/8

కేశవ్‌ పద్దు.. హామీల రద్దు

కేశవ్‌ పద్దు.. హామీల రద్దు 5
5/8

కేశవ్‌ పద్దు.. హామీల రద్దు

కేశవ్‌ పద్దు.. హామీల రద్దు 6
6/8

కేశవ్‌ పద్దు.. హామీల రద్దు

కేశవ్‌ పద్దు.. హామీల రద్దు 7
7/8

కేశవ్‌ పద్దు.. హామీల రద్దు

కేశవ్‌ పద్దు.. హామీల రద్దు 8
8/8

కేశవ్‌ పద్దు.. హామీల రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement