క్షేమంగా చేరుకున్న యాత్రికులు | - | Sakshi
Sakshi News home page

క్షేమంగా చేరుకున్న యాత్రికులు

Feb 15 2026 12:41 PM | Updated on Feb 15 2026 12:41 PM

క్షేమంగా చేరుకున్న యాత్రికులు

క్షేమంగా చేరుకున్న యాత్రికులు

నెల్లిమర్ల రూరల్‌: మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన యాత్రికులు శనివారం సాయంత్రం క్షేమంగా స్వస్థలానికి చేరుకున్నారు. సుమారు 36 మందితో ఈనెల 2న కాశీ యాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌ జిల్లాలో శుక్రవారం వేకువ జామున ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సారిపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్‌ నడిపేన శ్రీనివాసరావు ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. పలువురికి గాయాలు కాగా సమీప ఆస్పత్రిలోని ప్రథమ చికిత్స తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో నెల్లిమర్లకు సురక్షితంగా చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ మృతి చెందిన విషాదం ఒక వైపు ఉంటే.. యాత్రికులు క్షేమంగా తిరిగి రావడం మరోవైపు ఉమశమనం కలిగించింది.

Advertisement
 
Advertisement
Advertisement