
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారిగా బీఆర్‌ఎస్ అధి నేత, శాసనసభ పక్షనేత కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం తెలంగాణభవన్‌కు రానున్నా రు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయ కులతో సమావేశమవుతారు. ఈ మేరకు ఎమ్మెల్యే లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు రావాలని అధినేత ఆదేశించారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో కృష్ణా బేసిన్‌లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారు.
అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనా చర్చించను న్నట్టు సమాచారం. అసెంబ్లీ సమావే శాల్లో ఎలా ముందుకు వెళ్లాలి? ప్రజాక్షే త్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడంలాంటి అంశాలను ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై కేసీఆర్ చర్చించి నేతలకు సూచనలు చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా తెలంగాణభవన్‌కు కేసీఆర్ రానుండటంతో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశముంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహులు వచ్చి కలవనున్నారు.