చంద్రబాబు రైతులను మోసం చేశాడు: కరణం ధర్మశ్రీ | Karanam Dharmasri Slams On Chandrababu Over Farmers Agriculture | Sakshi
Sakshi News home page

చంద్రబాబు రైతులను మోసం చేశాడు: కరణం ధర్మశ్రీ

Sep 17 2021 12:58 PM | Updated on Sep 17 2021 1:05 PM

Karanam Dharmasri Slams On Chandrababu Over Farmers Agriculture - Sakshi

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు గతంలో రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రుణ మాఫీ చేస్తానని రైతులను నిలువునా ముంచింది బాబు కాదా? అని ప్రశ్నించారు. వ్యవసాయం దండగ అని చెప్పిన వ్యక్తి బాబును మండిపడ్డారు. చంద్రబాబు హైటెక్‌ మోజులో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు.

రైతుల పట్ల టీడీపీకి ఏ విధానం కూడా లేదని మండిపడ్డారు. చరిత్రలో ఏనాడు కూడా చంద్రబాబు ఎలాంటి ప్రోత్సహకాలు ఇవ్వలేదన్నారు. రైతులకు ఏలాంటి మేలు కూడా బాబు చేయలేదన్నారు. వైఎస్సార్‌ వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారు. తండ్రి బాటలోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్నారని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement