బాబుది విధ్వంస యాత్ర | Kannababu comments over Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబుది విధ్వంస యాత్ర

Aug 7 2023 4:22 AM | Updated on Aug 7 2023 8:09 AM

Kannababu comments over Chandrababu Naidu - Sakshi

కాకినాడ రూరల్‌: రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంస యాత్ర సాగిస్తున్నారని, అరాచకం సృష్టించేందుకే కుట్రపూరితంగా యాత్ర చేపడుతున్నారని మాజీమంత్రి, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలో ఆదివారం  మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎక్కడికెళ్లినా రెచ్చ­గొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముందుగానే ప్లాన్‌ వేసుకుని పుంగనూరు వెళ్లి 50 మంది పోలీసులను గాయపరిచారని, రక్తం వచ్చేలా దాడులు చేశారని, వాహనాలు తగలబెట్టారని చెప్పారు.  

అల్లర్లకు బాబు, పవన్‌ యత్నం.. 
చంద్రబాబు, ఆయనకు మద్దతు పలుకుతున్న పవన్‌ మాట్లాడుతున్న తీరుచూస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం అర్థమ­వు­తోందన్నా­రు. పుంగనూరులో టీడీపీ కా­ర్య­కర్తలతో దాడులు చేయించి మంత్రి పెద్ది­రెడ్డి రామచంద్రారెడ్డికి ఆపాదించే ప్రయత్నం చేశారని కన్నబాబు చెప్పారు.

పోలీసుల గురించి మాట్లాడే భాష ఇదేనా అని ప్రశ్నించారు. తన కార్యకర్తపై చేయి చేసుకున్నారంటూ సీఐ అంజుయాదవ్‌పై గతంలో గొడవ చేసిన పవన్‌.. ఇదే పోలీసులపై చంద్రబాబు దాడి చేయిస్తే ఎందుకు మాట్లాడటంలేదని  ప్రశ్నించారు.
 
బాబు ఏ ప్రాజెక్టు పూర్తిచేశారు? 
 14 ఏళ్లు సీఎంగా పనిచేసి ఏ ప్రాజెక్ట్‌ పూర్తిచేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.  కక్కుర్తితో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తిచేసి రాయలసీమ ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. ఇక చంద్రబాబుకు సింహం బ్రాండ్‌ లేదని, మామగారిని కుళ్లబొడిచిన నక్కజిత్తుల బ్రాండ్‌ ఉందని కురసాల ఎద్దేవా చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement