Congress Party: కాంగ్రెస్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌

Hyderabad: Former MP MA Khan Resign to Congress party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ రాజీనామా ప్రభావం రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీపైనా పడింది. ఆయన పార్టీని వీడిన మరుసటి రోజే ఆజాద్‌ అనుచరుడిగా గుర్తింపు పొందిన రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఎం.ఎ. ఖాన్‌ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన లేఖను శనివారం ఆయన ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు.

కాంగ్రెస్‌ పార్టీ ప్రజల ఆలోచనల నుంచి దూరమైపోయిందని, మూలాలను కోల్పోయిందని లేఖలో ఖాన్‌ పేర్కొన్నారు. పార్టీకి పునర్వైభవం వచ్చే పరిస్థితులు కూడా లేవన్నారు. సోనియా అధ్యక్షురాలిగా ఉన్నంతకాలం సంప్రదింపులు జరిగేవని, ఆ తర్వాత అలాంటి సంప్రదాయం లేకుండా పోయిందని, ఏఐసీసీ కార్యాలయంలో, 10 జన్‌పథ్‌లో కోటరీ తయారైందని విమర్శించారు. జీ–23 పేరుతో సీనియర్లు గతంలో ఇచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకొని ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవన్నారు.  

చదవండి: (14 రోజుల్లో ఆజాద్‌ కొత్త పార్టీ ప్రారంభం... ఊహించని ఝలక్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top