హుజూరాబాద్‌ బరిలో బీఎస్పీ.. ప్రవీణ్‌ కుమార్‌పై ఒత్తిడి

Huzurabad Bypoll 2021: BSP Pressures RS Praveen Kumar To Contest - Sakshi

పోటీకి ప్రవీణ్‌కుమార్‌పై ఒత్తిడి తెస్తున్న బీఎస్పీ నేతలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నికలో త్వరలో ఆసక్తికర పరిణామా లు చోటు చేసుకునే అవకాశాలు కనిపి స్తున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ టీఆర్‌ఎస్‌–బీజేపీల మధ్య ద్విముఖ పోరే నడు స్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఇంకా తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనప్పటికీ.. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ఏర్పాట్లు చేసుకుంది. తాజాగా.. హుజూరాబాద్‌ బరిలో బీఎస్పీ దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేయాలంటూ పలువురు బీఎస్పీ నేతలు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26వ తేదీన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన పలువురు నేతలు బీఎస్పీలో చేరుతుండగా.. ఈ సందర్భంగా నిర్వహించే సభలో ఆయన హుజూరాబాద్‌ ఉపఎన్నికలో పోటీ చేయాలా? వద్దా? అన్న విషయంపై నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం.  
(చదవండి: Huzurabad : కాంగ్రెస్‌ నుంచి బరిలోకి మాజీమం‍త్రి కొండా సురేఖ..?)

బీఎస్పీతోనే బహుజన రాజ్యాధికారం: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
దేవరకొండ: బీఎస్పీ తోనే బహుజన రాజ్యా ధికారం సాధ్యమని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన బీసీ కులాల చర్చా కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. బీసీలు, బీసీ ఉపకులాల భవిష్యత్తు ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో బహుజనులకు విముక్తి కలి్పంచే పార్టీ బీఎస్పీ అని, బీసీలంతా ఐక్యంగా ఉద్యమించి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ బీసీ గణనకు భారత ప్రభుత్వం ఒప్పుకోవట్లేదని, 2014లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సకల జనుల వివరాలు ఎందుకు తెలపడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌ పేరును బహుజన భవన్‌గా మార్చాలన్నారు. ఈ సందర్భంగా పలువురు బీఎస్పీలో చేరారు. బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సిద్ధార్థ పూలే, నాయకులు రాజారావు, ప్రముఖ విద్యావేత్త వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top