‘గూడెం’లో నేడే ప్రజాగర్జన

A huge public meeting under the auspices of the CPI - Sakshi

సీపీఐ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ

లక్ష మంది జన సమీకరణ లక్ష్యం

హాజరుకానున్న పార్టీ జాతీయ కార్యదర్శి రాజా

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భారత కమ్యూనిస్టు పా ర్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న ప్రజాగర్జన బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో జరిగే సభకు పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా ముఖ్య అతి థిగా హాజరు కానున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కో రుతూ ఈ ఏడాది ఏప్రిల్‌ 14న సీపీఐ ఆధ్వర్యంలో ప్రజాపో రు యాత్రలు చేపట్టి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు నిర్వహించారు. పోడు సాగుదారులకు పట్టాల పంపిణీ, సింగరేణి ప్రైవేటీకరణ, రాజ్యాంగ, లౌకిక వ్యవస్థల పరిరక్షణ తదితర అంశాలపై విస్తృతంగా ప్రచారం చేశారు.  

ఎర్ర జెండా రెపరెపలతో..: ప్రజాగర్జన బహిరంగ సభ నేపథ్యంలో కొత్తగూడెం పట్టణం ఎరుపెక్కింది. ప్రకాశం స్టేడియంలో భారీ వేదిక ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు లక్ష మంది జన సమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టే గత నెలరోజులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.  

బెల్లంపల్లి నుంచి ప్రత్యేక రైలు..: కొత్తగూడెంలో నిర్వహించే బహిరంగ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రధా నంగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఇందుకో సం వెయ్యి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా 300 చొప్పున బస్సుల్లో కార్యకర్తలు తరలివస్తారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని తెలిపారు.

ఒక్క కొత్తగూడెం నియోజకవర్గం నుంచే 25 వేల మందికి పైగా ప్రజలను తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశామని, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్నారని చెప్పా రు. సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి వేలాదిగా కార్మికులు  వచ్చేందుకు బెల్లంపల్లి నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌ జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తారని వివరించారు.
 
హాజరుకానున్న రాజా..: ఈ సభకు జాతీయ కార్యదర్శి డి.రాజాతో పాటు సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ, అజీజ్‌ పాషా, చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీనియర్‌ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, వాసిరెడ్డి సీతారామయ్య, ప్రముఖ కళాకారులు గోరటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్‌ తదితరులు హాజరుకానున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top