
సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, అచ్చం పేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సోమవారం (ఆగస్టు4) బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు.
పార్టీపై అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. బాలరాజుతో పాటుగా మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది.
గువ్వల బాలరాజ్ 2014 నుంచి 2023 వరకు రెండు సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే, మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో నాటి నుంచి పార్టీలో ఇన్ యాక్టీవ్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం (ఆగస్టు3) రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో గువ్వల బాలరాజ్ భేటీ అయ్యారు. ఇవాళ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. కాగా, బాలరాజు త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.