Gujarat Assembly Elections 2022: BJP President JP Nadda Released Manifesto, Details Inside - Sakshi
Sakshi News home page

Gujarat Elections 2022: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో..

Nov 26 2022 2:19 PM | Updated on Nov 26 2022 3:59 PM

Gujarat Assembly Elections BJP Manifesto JP Nadda - Sakshi

ఉమ్మడి పౌర స్మృతి ‍అమలుకు చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో పొందుపరిచారు

గాంధీనగర్: డిసెంబర్ 1,5 తేదీల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసింది బీజేపీ. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం గాంధీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మేనిఫెస్టోలోని పథకాలను ప్రకటించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సహా ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తమకు మరోసారి అధికారం ఇస్తే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు నడ్డా. మహిళలకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఉమ్మడి పౌర స్మృతి ‍అమలుకు చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో పొందుపరిచారు.  బీజేపీ ఇస్తున్న ఇతర ముఖ్య హామీలు..

► ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఆర్థిక సాయం
► బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
► ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం
► ఉగ్రకార్యకపాలు నివారించేందుకు యాంటి రాడికల్ సెల్ ఏర్పాటు..
►గుజరాత్ వాసులందరికీ పక్కా ఇళ్లు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 100 శాతం అమలు
► మహిళా సీనియర్ సిటిజెన్లకు ఉచిత బస్సు ప్రయాణం
► 20వేల ప్రభుత్వ స్కూళ్లను ఎక్సలెన్స్‌ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు వచ్చే ఐదేళ్లలో రూ.10వేల కోట్ల కేటాయింపు
► బాగా చదివే కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు
చదవండి: అది జైలు కాదు దర్బార్.. ఢిల్లీ మంత్రి మరో వీడియో లీక్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement