ఏఐతో ఉద్యోగాల కోత అనేది అసంబద్ధం | AI Replacing Jobs Nonsense Infosys CoFounder Nandan Nilekani Take | Sakshi
Sakshi News home page

ఏఐతో ఉద్యోగాల కోత అనేది అసంబద్ధం

Oct 14 2026 8:26 AM | Updated on Oct 14 2026 8:26 AM

AI Replacing Jobs Nonsense Infosys CoFounder Nandan Nilekani Take

ఏఐతో దేశీ ఐటీ సర్వీసులలో ఉద్యోగాలకు కోత పడుతుందన్న భయాలు అర్థంలేనివని సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకుడు నందన్‌ నిలేకని వ్యాఖ్యానించారు. ఏఐతో ఉద్యోగాలు పోతాయనడం అసంబద్ధమని తెలియజేశారు. ఇదంతా భారీ పెట్టుబడులకు అనుగుణంగా చేస్తున్న తప్పుడు మార్కెటింగ్‌గా తాను భావిస్తున్నట్లు చెప్పారు. దేశీ ఐటీ సంస్థలకు ఇంతక్రితం ఎన్నడూలేని విధంగా డిమాండ్‌ కనిపిస్తున్నట్లు తెలియజేశారు.

ఏఐ అనేది నెమ్మదిగా కదులుతున్న సునామీగా అభివర్ణించిన ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టాలినీ జార్జివాస్‌ వ్యాఖ్యలపై 2026 బ్లూమ్‌బెర్గ్‌ న్యూ ఎకానమీ సదస్సు సందర్భంగా నిలేకని స్పందించారు. రొటీన్‌గా చేసే టాస్క్‌లను ఏఐలు ఆక్రమించుకోవడం ద్వారా పలువురు ఉద్యోగాలు కోల్పోతారన్న క్రిస్టాలినీ అభిప్రాయాలను ఖండించారు. ఇన్ఫోసిస్‌ లేదా ఇతర ఐటీ కంపెనీలకు ఇటీవల మరింత డిమాండ్‌ కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎంటర్‌ప్రైజ్‌ల ట్రాన్స్‌ఫార్మేషన్‌ అనేది అత్యంత క్లిష్టమైన వ్యవహారమని, ఫండమెంటల్‌గా వీటిని పునర్‌నిర్వచించడంలో మాత్రమే ఏఐ ఆవశ్యకత ఉంటుందని తెలియజేశారు. వేర్ల నుంచి కొమ్మలవరకూ పూర్తిస్థాయిలో చేపట్టవలసిన సర్జరీ వంటిదని వివరించారు. నిజానికి ఇలాంటి ట్రాన్స్‌ఫార్మేషన్లను చేపట్టేందుకు ఏఐకు ఇన్ఫోసిస్‌ వంటి కంపెనీల అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. వెరసి ఇన్ఫోసిస్‌ తదితర కంపెనీలకు మరిన్ని కాంట్రాక్టులు లభించనున్నట్లు అంచనా వేశారు. అయితే ఉద్యోగ నైపుణ్యాలను పెంచుకోవడంతోపాటు, కొత్త సామర్థ్యాలకు తెరతీయడం ద్వారా కంపెనీలు ట్రాన్స్‌ఫార్మ్‌ కావలసి ఉన్నట్లు వెల్లడించారు. రెండు దశాబ్దాల క్రితమే క్లౌడ్‌ కంప్యూటింగ్‌ను కనుగొన్నప్పటికీ పూర్తిస్థాయిలో వ్యాప్తి చెందలేదన్నారు.

ఇదీ చదవండి: రచ్చకెక్కిన టీవీఎస్ ఫ్యామిలీ వార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement