జీతం బాగున్నా జాబ్‌ వదిలేస్తున్నారు.. అసలు కారణం ఇదే! | High Salary Employees Quitting Jobs Real Reason | Sakshi
Sakshi News home page

జీతం బాగున్నా జాబ్‌ వదిలేస్తున్నారు.. అసలు కారణం ఇదే!

Oct 20 2026 8:56 AM | Updated on Oct 20 2026 9:22 AM

High Salary Employees Quitting Jobs Real Reason

సాక్షి, హైదరాబాద్‌: పనిచేస్తున్న సంస్థకు గుడ్‌బై చెప్పి మరో సంస్థలో చేరేందుకు ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తోంది ఏమిటనే ప్రశ్నకు చాలా మంది అధిక జీతాలే కారణం అనుకుంటారు. అయితే అది వాస్తవం కాదని.. పనిచేస్తున్న చోట నప్పని పరిస్థితులే కారణమని మానవ వనరుల నియామక పరిష్కారాలను అందించే జీనియస్‌ హెచ్‌ఆర్‌టెక్‌ నిర్వహించిన తాజా అధ్యయనం తేల్చింది. సెపె్టంబర్‌ 1–30 మధ్య ఐటీ, తయారీ, టెలికం, రిటైల్, ఫైనాన్స్, బీఎఫ్‌ఎస్‌ఐ, ఎఫ్‌ఎంసీజీ, ఇంజనీరింగ్‌ వంటి రంగాలకు చెందిన ఉద్యోగుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం రూపొందింది. 

పైసలకన్నా పని వాతావరణమే మిన్న... 
ఉద్యోగ నిర్ణయాలు కేవలం తాము అందుకొనే జీతంపైనే ఆధారపడి ఉండవని.. నిర్వహణ సామర్థ్యం లోపించిన యాజమాన్యం లేదా నప్పని కార్యాలయ సంస్కృతి వంటి అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అధ్యయనంలో పాల్గొన్న వారిలో 47 శాతం మంది స్పష్టం చేశారు. కేవలం 30 శాతం మందే మార్కెట్‌ అంచనాల కంటే తక్కువ జీతభత్యాలను ఉద్యోగ మార్పిడికి కారణంగా చెప్పారు. ఆఫీస్‌ వర్క్‌ ఒత్తిడిరహితంగా ఉండాలని, ఆరోగ్యకరమైన కార్యాలయ సంస్కృతి మెరుగుçపడి సరైన యాజమాన్యం, కోరుకున్న వెసులుబాటు కల్పిస్తే తమ ప్రస్తుత సంస్థలోనే కొనసాగడానికి సిద్ధమని 39 శాతం మంది తేల్చిచెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement