breaking news
real reason
-
జీతం బాగున్నా జాబ్ వదిలేస్తున్నారు.. అసలు కారణం ఇదే!
సాక్షి, హైదరాబాద్: పనిచేస్తున్న సంస్థకు గుడ్‌బై చెప్పి మరో సంస్థలో చేరేందుకు ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తోంది ఏమిటనే ప్రశ్నకు చాలా మంది అధిక జీతాలే కారణం అనుకుంటారు. అయితే అది వాస్తవం కాదని.. పనిచేస్తున్న చోట నప్పని పరిస్థితులే కారణమని మానవ వనరుల నియామక పరిష్కారాలను అందించే జీనియస్ హెచ్‌ఆర్‌టెక్ నిర్వహించిన తాజా అధ్యయనం తేల్చింది. సెపె్టంబర్ 1–30 మధ్య ఐటీ, తయారీ, టెలికం, రిటైల్, ఫైనాన్స్, బీఎఫ్ఎస్ఐ, ఎఫ్ఎంసీజీ, ఇంజనీరింగ్ వంటి రంగాలకు చెందిన ఉద్యోగుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం రూపొందింది. పైసలకన్నా పని వాతావరణమే మిన్న... ఉద్యోగ నిర్ణయాలు కేవలం తాము అందుకొనే జీతంపైనే ఆధారపడి ఉండవని.. నిర్వహణ సామర్థ్యం లోపించిన యాజమాన్యం లేదా నప్పని కార్యాలయ సంస్కృతి వంటి అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అధ్యయనంలో పాల్గొన్న వారిలో 47 శాతం మంది స్పష్టం చేశారు. కేవలం 30 శాతం మందే మార్కెట్ అంచనాల కంటే తక్కువ జీతభత్యాలను ఉద్యోగ మార్పిడికి కారణంగా చెప్పారు. ఆఫీస్ వర్క్ ఒత్తిడిరహితంగా ఉండాలని, ఆరోగ్యకరమైన కార్యాలయ సంస్కృతి మెరుగుçపడి సరైన యాజమాన్యం, కోరుకున్న వెసులుబాటు కల్పిస్తే తమ ప్రస్తుత సంస్థలోనే కొనసాగడానికి సిద్ధమని 39 శాతం మంది తేల్చిచెప్పారు. -
ఫ్లైట్ విండోస్ ఎందుకు ఓపెన్ చేయాలో తెలుసా?
న్యూయార్క్: సాధారణంగా విమానంలో ప్రయాణమంటే అందరికీ హుషారే. ప్రారంభంలో కొంచెం భయంగా అనిపించినా ప్రయాణం ఊపందుకున్నాక ఏం చక్కా గాల్లో తేలిపోతుంటారు. ఆకాశంలో విహరిస్తున్నట్లుగా ఫీలయిపోతుంటారు. కాసేపట్లోనే చిన్నపాటి నిద్రలోకి జారుకుని ఎన్నో అందమైన కలలు కంటుంటారు. అయితే, మీ కలలను, స్వల్ప నిద్రను భగ్నం చేస్తూ మరికొద్ది సేపట్లో కిందికి దిగబోతున్నాం.. అంతా మీ కిటికీలను ఓపెన్ చేసుకోవచ్చు అని చెబుతుంటారు. అబ్బా అని మీకు చెర్రెత్తిపోతుంది. అయితే ఈ చిరాకు పడటానికి కూడా ఒక కారణం ఉంది. విమానం దిగిపోయే సమయంలో అలా ఎందుకు విండోస్ ఓపెన్ చేయాలని చెప్తారంటే 'ఒక వేళ అత్యవసర పరిస్థితి ఉన్నట్లయితే.. విమానం వెలుపల పరిస్థితులు ఏమిటో ఈ విండో బయట నుంచి చూడొచ్చు. ఒక వేళ అక్కడ శిథిలాలు, అగ్ని కీలలు, నీళ్లు ఉంటే మనం ఇక ఇతర జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎందుకంటే కిటికీలను కమ్మేసేంత పరిస్థితుల్లో ఇవి ఉంటే ముఖ్య ద్వారం గుండా కాకుండా ఇతర మార్గాలను అనుసరించాలని చెప్పే అవకాశం కలుగుతుంది. వాస్తవానికి ఇదంతా కూడా చాలా చిన్న అంశంగా కనిపించవచ్చేమోగానీ.. అలాంటి అత్యవసర సమయాల్లో ప్రతి సెకను లెక్కించుకోవాల్సి ఉంటుంది. విమాన ప్రమాదం చోటుచేసుకునేందుకు 90 సెకన్లలోపు తేరుకుంటే దీనిని నుంచి బయటపడొచ్చు. అందుకే కిటికీలు తెరవాలని చెప్తారని నిపుణులు చెప్తున్నారు.


