breaking news
quitting
-
అతివలను.. నిలువనివ్వని కొలువు
దేశంలోని కార్మిక, నైపుణ్య (బ్లూ, గ్రే కాలర్) ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో సగం మందికి పైగా.. ఉద్యోగంలో చేరిన ఏడాది లోపే తమ ఉద్యోగాన్ని విడిచిపెట్టే ఆలోచనలో ఉంటున్నారని స్త్రీ సాధికార సంస్థ ‘ఉదయతి ఫౌండేషన్’, ఐటీ కంపెనీలకు ఉద్యోగులను సమకూర్చే ‘క్వెస్ కార్ప్’ కలిసి రూపొందించిన తాజా నివేదికలో వెల్లడైంది. రౌండేళ్లకు పైగా తమ ఉద్యోగాల్లో నిలదొక్కుకోగలిగిన మహిళల్లో ఉద్యోగం మానేయాలన్న తలంపు 3 శాతం మాత్రమే ఉండగా, ఒక ఏడాది కంటే తక్కువ కాలం ఉద్యోగం చేస్తున్న వారిలో ఇది 52 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఇంటా బయటా మహిళలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని ఈ ధోరణి తెలియజేస్తోందని నివేదిక పేర్కొంది.జీతం పెంచితే మళ్లీ వస్తాం..: 54 శాతం మంది మహిళలు తమ ఆదాయం ఏమంత సంతృప్తికరంగా లేదని చెప్పగా, వారిలో 80 శాతం మంది నెలకు రూ. 2,000 కంటే తక్కువ ఆదా చేయగలుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన జీతం ఉంటే మహిళలు ఉద్యోగం మానేయాలన్న భావనలో ఉండేవారు కాదని సర్వే చెబుతోంది. రూ. 20,000 కంటే ఎక్కువ సంపాదించే మహిళలు ఉద్యోగం మానేసే అవకాశం 21 శాతం తక్కువగా ఉండగా, పని మానేసి వెళ్లిన వారిలో 42 శాతం మంది తమకు మెుగైన వేతనాలు ఇస్తామంటే తిరిగి ఉద్యోగంలో చేరుతామని చెప్పినట్లు నివేదిక తెలిపింది.రిటైల్, వస్తు ఉత్పత్తి, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా వంటి రంగాలలో ప్రస్తుతం పని చేస్తున్న 10,000 మంది, గతంలో పనిచేసిన 1,500 మంది మహిళా కార్మిక ఉద్యోగులపై ఉదయతి, క్వెస్ కార్ప్ సర్వే నిర్వహించి ‘స్టేట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ది బ్లూ–గ్రే కాలర్ వర్క్‌ఫోర్స్ 2025’ అనే పేరుతో ఈ నివేదికను రూపొందించాయి. తక్కువ జీతం, సదుపాయంగా లేని రోజువారీ ప్రయాణం, భద్రతా సమస్యలు, ఉద్యోగంలో ఎదుగుదలకు పరిమిత అవకాశాలు, అన్ని కలిసి మహిళా కార్మిక ఉద్యోగులు తమకు తాముగా ఉద్యోగం మానేసే పరిస్థితులను కల్పిస్తున్నాయని సర్వే స్పష్టం చేసింది. సురక్షితం కాని రాకపోకలు..: ప్రస్తుత మహిళా ఉద్యోగుల్లో 57 శాతం మంది నివాస స్థలానికి, పని ప్రదేశానికి మధ్య సజావైన రవాణా సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారట. 11 శాతం మంది తమ ప్రయాణ మార్గంలో, ముఖ్యంగా రాత్రి షిఫ్ట్‌లలో సురక్షితంగా లేమని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. చాలామంది హాస్టళ్లపై ఆధారపడతారు కానీ, ప్రయాణాల్లో మళ్లీ అదే భయం, అదే అభద్రత. ఉద్యోగం వదిలిపెట్టిన ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు, ఇంటికి దగ్గరగా ఉద్యోగావకాశం వస్తే తిరిగి ఉద్యోగానికి వెళ్తామని చెప్పారు.పని ప్రదేశంలో మహిళల భద్రత కూడా ఆందోళనకరంగానే ఉంది. 22 శాతం మంది మహిళలు పనిలో తాము సురక్షితంగా లేమని భావిస్తున్నారట. 28 శాతం మహిళలు.. ఎక్కువ గంటలు, కష్టతరమైన పరిస్థితుల వల్లే తాము ఉద్యోగం మానేశామని చెప్పారు. వారిలో మూడింట ఒక వంతు మంది తమకు ఒత్తిడిని తట్టుకునే శక్తి లేకపోవటమే కారణమన్నారు.67 శాతం మానేశారు⇒ బ్లూ–గ్రే ఉద్యోగాలలో ఉన్న ఎంట్రీ–లెవల్ మహిళల్లో సగం మంది ఒక సంవత్సరం లోపే ఉద్యోగ విరమణ చేయాలన్న ఆలోచనకు వచ్చేస్తున్నారు.⇒ 2020–21లో 16 శాతంగా ఉన్న బ్లూ–గ్రే కాలర్ ఉద్యోగాలలో మహిళల వాటా 2023–24లో 19 శాతానికి పెరిగినప్పటికీ, ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్’ సర్వే ప్రకారం, గత ఆరు నెలల్లో అనేక ప్రతిబంధకాల కారణంగా 67 శాతం మంది మహిళలు ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయారు.ఆ 5 కీలకం⇒ మహిళల్ని ఉద్యోగం మానేయకుండా ఆపగలవని నివేదిక గుర్తించిన 5 అంశాలు...⇒ మెరుగైన వేతనం సురక్షితమైన ప్రయాణ సదుపాయం⇒ అనువుగా మార్చిన కార్యాలయ మౌలిక సదుపాయాలు⇒ స్పష్టమైన వృద్ధి అవకాశాలు⇒ అందరినీ కలుపుకొనిపోయే కార్యాలయ సంస్కృతిమహిళలు సామర్థ్యం లేకపోవడం వల్ల ఉద్యోగం మాని వెళ్లిపోవడం లేదు. వారికి తగినట్లుగా మనమింకా మౌలిక సదుపాయాలను కల్పించడం లేదు. వారి నుంచి అత్యుత్తమ ఫలితాలను సాధించటానికి అనువుగా పని ప్రదేశాలను మలుచుకోవడం లేదు. అందుకే వాళ్లు మధ్యలోనే ఉద్యోగం మానేస్తున్నారు– పూజా గోయల్, ఉదయతి ఫౌండేషన్ వ్యవస్థాపక సీఈఓఎదిగే అవకాశాలు అస్పష్టం..: కెరీర్లో ఎదుగుదలకు సంబంధించి స్పష్టమైన దారేదీ కనిపించక ఉద్యోగాన్ని వదిలేశామని 21 శాతం మంది మహిళలు తెలిపారు. ముఖ్యంగా బీ.ఎఫ్.ఎస్.ఐ. (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) టెలికం రంగాల్లో ఎదుగుదల అవకాశాలు అస్పష్టంగా ఉన్నప్పుడు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఆ ఉద్యోగంలో పనిచేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్లలో ఉద్యోగ విరమణ చేసే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉందని డేటా తెలిపింది. అయినప్పటికీ 11 శాతం మంది మహిళలు అదనపు నైపుణ్యాలలో శిక్షణ పొంది ఉద్యోగాలలో కొనసాగుతున్నారు. -
అభిమానులకు షాకిచ్చిన గాయని
ప్రముఖ అమెరికన్ ర్యాపర్, గాయని నిక్కీ మినాజ్(36) తన అభిమానులకు షాకిచ్చింది. ఇంకపై సంగీత ప్రపంచం నుంచి దూరంగా వుంటాలనుకుంటున్నానని వెల్లడించారు. నిక్కీ ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించగానే కోట్లాది మంది ఫ్యాన్స్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక పై తాను కుటుంబ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు నిక్కీ తెలిపారు. సంగీత పరిశ్రమ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. ఇకపై తాను కుటుంబ జీవితం గడపాలని అనుకుంటున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె వెల్లడించారు. అయితే తన తాను చనిపోయేంతవరకు అభిమానులు తనను అభిమానిస్తూనే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. 2 కోట్ల అభిమానులను సంపాదించుకున్న నిక్కీ మినాజ్ తన బాయ్ ఫ్రెండ్ జూ పెటీని రహస్యంగా పెళ్లాడినట్టు తెలుస్తోంది. అంతేకాదు తన ట్విటర్ అకౌంట్ పేరును మిసెస్ పెటీగా మార్చుకోవడం విశేషం. పెటీని పెళ్లాడబోతున్నట్టుగా ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా 2010లో ‘పింక్ ఫ్రైడే’ అల్బమ్ తో నిక్కీ మినాజ్ పాప్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ది పింక్ ప్రింట్, క్వీన్, ప్లే టైమ్ ఈజ్ ఓవర్ వంటి ఆల్బమ్స్ తో మంచి పేరు తెచ్చుకున్నారు. మినాజ్ ఎప్పటికప్పుడు అత్యంత ప్రభావవంతమైన హిప్ హాప్ కళాకారులలో ఒకరిగా గుర్తింపు పొందారు. తన కెరీర్ మొత్తంలో 10 గ్రామీ నామినేషన్లు, ఆరు అమెరికన్ మ్యూజిక్ అవార్డులు, 11బీఈటీ అవార్డులు , నాలుగు బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డులు, ఇతర పురస్కారాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురి సంగీత అభిమానుల ప్రశంసలను ఆమె సొంతం చేసుకున్నారు. I’ve decided to retire & have my family. I know you guys are happy now. To my fans, keep reppin me, do it til da death of me, ❌ in the box- cuz ain’t nobody checkin me. ✅ Love you for LIFE 😘♥️🦄 — Mrs. Petty (@NICKIMINAJ) September 5, 2019 -
మత విశ్వాసాన్ని కాపాడేందుకే : జైరా
జాతీయ అవార్డు గ్రహీత, దంగల్ ఫేమ్ జైరా వసీమ్ ఇకపై సినిమాల్లో నటించనని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆదివారం వెల్లడించారు. తనకు వచ్చే పాత్రల ద్వారా మా మతవిశ్వాసాన్ని కోల్పోతున్నాని, అందుకే ఇకపై సినిమాల్లో నటించనని స్పష్టం చేశారు. 'నేను బాలీవుడ్లో అడుగుపెట్టి 5 సంవత్సరాలయింది. దంగల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాకు అనతికాలంలోనే బాలీవుడ్లో మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి. సినిమాల్లో నేను పోషించే పాత్రల ద్వారా ఇప్పటి యువతకు ఒక రోల్‌మోడల్‌గా నిలవాలని అనుకున్నాను. అయితే ఈ ఐదేళ్లలో కెరీర్ పరంగా సంతృప్తిగా ఉన్నా, నిజ జీవితంలో మాత్రం సంతోషంగా లేను. నాకు వస్తున్న పాత్రల ద్వారా ఎక్కడ నేను మత విశ్వాసాన్ని కోల్పోతానేమోనని భయంగా ఉంది. నిత్యం ఖురాన్‌ను పఠిస్తున్న నాకు జీవితం ముగిసిపోయేలోగా సమాజానికి నావంతుగా ఏదైనా మంచి చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాను. సినిమా ఫీల్డ్‌లో ఉంటూ నాకున్న భాద్యతలను సక్రమంగా నిర్వర్తించలేనని, అందుకే సినిమాలను వదిలేస్తున్నాన'ని జైరా వసీమ్ పేర్కొన్నారు. 2016లో విడుదలైన దంగల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు జైరా వసీమ్. మొదటి సినిమాతోనే ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. 2017లో సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో నటించి మరో ఘన విజయాన్ని దక్కించుకున్నారు. ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు అవార్డును తీసుకున్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్ నటిస్తున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే జైరా వసీమ్ సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. -
స్మోకింగ్ మానేశాక ఏం చేస్తున్నారంటే...
'పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్' అన్న కవి మాటలు వినేందుకు సొంపుగా అనిపించినా, ధూమపానానికి బానిసలైనవారంతా చివరికి అనారోగ్యాలు దరి చేరేసరికి అలవాటును మానుకోవాలని ప్రయత్నిస్తారు. అందులో కొందరు ఎలాగో నానా తంటాలు పడి సిగరెట్లు తాగడం మానేస్తారు. కానీ వారు అంతటితో ఆగకుండా మరో దారి వెతుక్కుంటున్నారని, ముఖ్యంగా ఇండియన్స్ సిగరెట్లు, బీడీల్లాగే శరీరానికి హాని చేసే పొగాకుకు అలవాటు పడుతున్నారని తాజా సర్వేలు చెప్తున్నాయి. సిగరెట్లు, బీడీలు తాగే అలవాటును మానుకున్న చాలామంది భారతీయులు పొగాకుతో తయారు చేసే ఇతర హానికర వస్తువులకు బానిసలౌతున్నారని ఓ అంతర్జాతీయ సర్వే వెల్లడించింది. ధూమపానం మానేసిన భారతీయుల్లో 44 శాతంమంది ఇతర టుబాకో వస్తువులకు దగ్గరౌతున్నారని, అవికూడ సిగరెట్లు, బీడీల్లాగే అనారోగ్యకారకాలని చెప్తున్నారు. 50.8 శాతం పురుషులు, 8.7 శాతం మహిళలు పొగలేని టుబాకో వస్తువులైన పొగాకు, ఖైనీ, పాన్ మసాలా, జర్దా, గుట్కాలను అలవాటు చేసుకుంటున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది. దేశంలోని 29 రాష్ట్రాలు, రెండు యూనియన్ టెర్రిటరీస్ లోని 15 ఏళ్ళకు పైబడిన సుమారు 70 వేలమందిపై సర్వే నిర్వహించగా వారిలో 44.4 శాతం మంది సాదా పొగాకు, ఖైనీ, పాన్ మసాలా, జర్దా, గుట్కాలను తీసుకుంటున్నట్లు తెలిసింది. మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ కి చెందిన సెంటర్ ఫర్ హెల్త్ సైన్స్ లోని అచ్యుత మెనన్ ద్వారా ఈ సర్వే నిర్వహించారు. టుబాకో ధూమపానం కంటే అత్యంత ప్రమాదకరమని, పొగలేని టుబాకో వస్తువులు, నికోటిన్ పదార్థాలను సైతం బ్యాన్ చేసి, ప్రజల్లో అవగాహన కల్పించాలని అచ్యుత మెనన్ సెంటర్ ప్రిన్సిపాల్ ఆర్.కె. థంకప్పన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పనికోసం ఒకప్రాంతంనుంచీ మరో ప్రాంతానికి వలసలు వెళ్ళే వర్కర్లు ఎక్కువగా ఈ పొగలేని టుబాకో వస్తువులకు బానిసలౌతున్నారని, వారిలో ప్రత్యేకంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని థంకప్పన్ అన్నారు. ముఖ్యంగా ఇండియాలో 20.6 కోట్ల మంది పొగలేని టుబాకో వస్తువులను వినియోగిస్తున్నట్లు, పొగతాగే 11.12 కోట్ల మంది కన్నా వీరు అధికంగా ఉన్నట్లు సర్వేల్లో తేలింది. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా ఎంతో మంది ధూమపానానికి బానిసలౌతున్నారని, ముఖ్యంగా పొగ లేని టుబాకో వస్తువులవల్ల కూడ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని సీనియర్ ప్రాజెక్ట్ ఫెల్లో, అధ్యయన కో ఆథర్ జీ కె మిని తెలిపారు.