అభిమానులకు షాకిచ్చిన గాయని 

Americal Rapper Nicki Minaj announced : quitting music industry - Sakshi

ప్రముఖ అమెరికన్ ర్యాపర్, గాయని నిక్కీ మినాజ్(36) తన అభిమానులకు షాకిచ్చింది. ఇంకపై సంగీత ప్రపంచం నుంచి దూరంగా వుంటాలనుకుంటున్నానని  వెల్లడించారు. నిక్కీ ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించగానే  కోట్లాది మంది ఫ్యాన్స్‌ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి  లోనయ్యారు. ఇక పై తాను కుటుంబ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు నిక్కీ  తెలిపారు. సంగీత పరిశ్రమ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. ఇకపై తాను కుటుంబ జీవితం గడపాలని అనుకుంటున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె వెల్లడించారు. అయితే తన  తాను చనిపోయేంతవరకు అభిమానులు తనను అభిమానిస్తూనే ఉండాలని  కోరుకుంటున్నానన్నారు.  

2 కోట్ల అభిమానులను సంపాదించుకున్న నిక్కీ మినాజ్ తన బాయ్ ఫ్రెండ్ జూ పెటీని రహస్యంగా పెళ్లాడినట్టు తెలుస్తోంది. అంతేకాదు తన ట్విటర్‌ అకౌంట్‌ పేరును మిసెస్ పెటీగా మార్చుకోవడం విశేషం. పెటీని పెళ్లాడబోతున్నట్టుగా ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా  2010లో ‘పింక్ ఫ్రైడే’ అల్బమ్ తో నిక్కీ మినాజ్ పాప్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ది పింక్ ప్రింట్, క్వీన్, ప్లే టైమ్ ఈజ్ ఓవర్ వంటి ఆల్బమ్స్ తో మంచి పేరు తెచ్చుకున్నారు.  మినాజ్ ఎప్పటికప్పుడు అత్యంత ప్రభావవంతమైన హిప్ హాప్ కళాకారులలో ఒకరిగా గుర్తింపు పొందారు. తన కెరీర్ మొత్తంలో 10 గ్రామీ నామినేషన్లు, ఆరు అమెరికన్ మ్యూజిక్ అవార్డులు, 11బీఈటీ అవార్డులు , నాలుగు బిల్‌బోర్డ్‌ మ్యూజిక్ అవార్డులు, ఇతర   పురస్కారాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా  పలువురి సంగీత అభిమానుల  ప్రశంసలను ఆమె సొంతం చేసుకున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top