‘అందుకే 30 ఏళ్లలో 58సార్లు సింగపూర్‌కు చంద్రబాబు’ | Gudivada Amarnath Satires On CM Chandrababu Singapore Tour | Sakshi
Sakshi News home page

‘అందుకే 30 ఏళ్లలో 58సార్లు సింగపూర్‌కు చంద్రబాబు’

Aug 2 2025 10:31 AM | Updated on Aug 2 2025 1:06 PM

Gudivada Amarnath Satires On CM Chandrababu Singapore Tour

చంద్రబాబు సింగపూర్‌ పర్యటనపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సెటైర్లు వేశారు. అక్కడికి వెళ్లి సాధించింది ఏంటో కూడా చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అమర్నాథ్‌ అన్నారాయన. శనివారం ఉదయం విశాఖపట్నంలో అమర్నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. 

సాక్షి,  విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్‌ పర్యటనపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సెటైర్లు వేశారు. అక్కడికి వెళ్లి సాధించింది ఏంటో కూడా చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అన్నారాయన. శనివారం అమర్నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు 30 ఏళ్లలో 58 సార్లు సింగపూర్‌కు వెళ్లారు.  అక్రమంగా సంపాదించిందంతా దాచుకోవడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. అందుకే ఆయన అక్కడికి వెళ్లి సాధించింది ఏమిటో చెప్పుకోలేకపోతున్నారు..

.. ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించింది ఏమిటి?. సాధించింది ఏమీ లేకే వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. అదానీ డేటా సెంటర్‌ గురించి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ అది ఏర్పాటైంది వైఎస్సార్‌సీపీ హయాం. సముద్ర జలాలు ఉపయోగించుకోవాలని చంద్రబాబు, లోకేష్‌లకు ఎప్పుడైనా అనిపించిందా?. లోకేష్‌ చెబుతున్న బ్లూ ఎకానమీకి అంకురార్పణ జరిగింది కూడా వైఎస్సార్‌సీపీ హయాంలోనే. కేవలం ఐదేళ్ల పాలనలో వైఎస్‌ జగన్‌ ప్రధానమైన మూడు పోర్టులను పూర్తి చేశారు..

.. భూములను ఉద్యోగాలు కల్పించే నాణ్యమైన కంపెనీలకు అప్పగిస్తే ఫర్వాలేదు. కానీ, విశాఖలో విలువైన భూములను రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు కట్టబెట్టారు. 99 పైసల చొప్పున.. రూ.1,350 కోట్ల విలువైన భూమిని అప్పన్నంగా అప్పగించారు. లులు సంస్థకు కారుచౌకగా భూములను, ఉర్సాకు 60 ఎకరాల భూమి ఇచ్చారు. ఎక్కడా పారదర్శకత లేకుండా భూములు కేటాయించారు. కంచె చేను మేసినట్లుగా ఉంది ఈ ప్రభుత్వ పరిస్థితి’’ అని అమర్నాథ్‌ మండిపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement