‘రెండు నెలల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేయగలం’

చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ పార్టీపై చార్మినార్ ఎమ్మెల్యే, మజ్లీస్ పార్టీ సీనియర్ నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకుంటే రెండు నెలల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేయగలమని హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మజ్లీస్ పార్టీ చాలా మందిని చూసిందని, తమ అధినేత చెప్పినట్టు రాజకీయం తమ ఇంటి గుమస్తాతో సమానం అన్నారు. కేటీఆర్ నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన చిలుక అని ఎద్దేవా చేశారు. తమకు రాజకీయాల్లో ఒకరిని గద్దే మీద కూరోచబెట్టడం తెలుసు.. గద్దె దించడం తెలుసు అని పరోక్షంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి