పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Former Minister Tummala Nageswara Rao Clarity On Party Change - Sakshi

సాక్షి, ఖమ్మం​ జిల్లా: పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ వెంటే తాను ఉంటానని తుమ్మల స్పష్టం చేశారు. ములుగు జిల్లా వాజేడులో గురువారం ఆయన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ నాయకత్వంలో మనం పని చేయాల్సిన అవసరం ఉందని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అనుచరులకు ఆయన పిలుపునిచ్చారు.

రాజకీయాల్లో ఒడి దుడుగులు సహజం. రాబోయేవి మన రోజులే.. ఎవరు అధైర్య పడొద్దు.. ఆందోళన చెందవద్దని తుమ్మల అన్నారు. 40 ఏళ్లు రాజకీయంగా ఏ విధంగా ఉన్నానో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ఉంటాను. ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేల కోట్లు ఇచ్చారు. మనకు మేలు చేసే వ్యక్తులనే మనం ఆదరించాలి. తాత్కాలిక అవసరాల కోసం నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు వస్తాయి’’ అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
చదవండి: అసలు కథ ఇప్పుడే మొదలైంది.. ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో కీలక ట్విస్ట్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top