Ex-MP AP Jithender Reddy Really Posts Angry Tweet On Telangana BJP? - Sakshi
Sakshi News home page

దున్నపోతుని తన్నినట్లు.. తెలంగాణ బీజేపీ నేత జితేందర్‌రెడ్డి వరుస ట్వీట్ల కలకలం

Jun 29 2023 11:25 AM | Updated on Jun 29 2023 1:56 PM

Ex MP AP Jithender Reddy Really Post Angry Tweet On Telangana BJP - Sakshi

దున్నపోతును వెనుక నుంచి తన్నుకుంటూ ఓ వ్యక్తి ఎక్కించే.. 

సాక్షి, మహబూబ్‌నగర్‌: తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరమంటూ ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి చేసిన ఓ ట్వీట్‌ దుమారం రేపుతోంది. దున్నపోతుల్ని తన్నుకుంటూ ఓ వ్యక్తి ట్రాలీలో ఎక్కిన వీడియోను పోస్ట్‌ చేసిన.. ఇది తెలంగాణ బీజేపీకి అవసరమంటూ క్యాప్షన్‌ ఉంచారు. ఆయన కాసేపటికే దానిని డిలీట్‌ చేసి.. మళ్లీ పోస్ట్‌ చేయడం గమనార్హం.

పైగా ఆ ట్వీట్‌కు అమిత్‌ షా, బీఎల్‌ సంతోష్‌, సునీల్‌ బన్సాల్‌ లాంటి అగ్రనేతలను ట్యాగ్‌ చేశారాయన. అయితే  ఆయన ట్విటర్‌ వాల్‌పై ఆ పోస్ట్‌ కనిపించకపోవడంతో.. ఆయన దానిని డిలీట్‌ చేసినట్లు అర్థమైంది. ఆ వెంటనే మళ్లీ ఆ వీడియోను ఆయన పోస్ట్‌ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో బీజేపీ గందరగోళ రాజకీయం నడిపిస్తోంది. పార్టీ కేడర్‌ సైతం అయోమయానికి గురవుతోంది. ఈ తరుణంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలంగాణ బీజేపీ నాయకత్వంపై అసంతృప్తితో రగిలిపోతున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ట్వీట్ తో పార్టీ పట్ల తన అసంతృప్తి చూపించారని కొందరు అంటుండగా.. పార్టీ మారతారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 

అయితే తన ట్వీట్‌ను సమర్థించుకునేలా మరో ట్వీట్‌ వెంటనే పోస్ట్‌ చేశారాయన. 

ఇదీ చదవండి: కేంద్రమంత్రిగా బండి.. ఈటలకేమో ఆ బాధ్యతలు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement