విద్యుత్‌ కమిషన్‌ విచారణ పారదర్శకంగా జరగడం లేదు: జగదీష్‌రెడ్డి | Ex Minister Jagadish Reddy Comments On Power Commission | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కమిషన్‌ విచారణ పారదర్శకంగా జరగడం లేదు: జగదీష్‌రెడ్డి

Published Tue, Jun 18 2024 8:00 PM | Last Updated on Tue, Jun 18 2024 8:21 PM

Ex Minister Jagadish Reddy Comments On Power Commission

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ విచారణ కమిషన్‌పై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. విచారణ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌పై అనవసర ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు.. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. విచారణ కమిషన్ పారదర్శకంగా విచారణ చేయటం లేదని నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. ప్రజాధనం దుర్వినియోగం జరగలేదు.. ఒప్పందాల మేరకే ప్రాజెక్టులు జరిగాయని కేసీఆర్ లేఖ రూపంలో చెప్పారు. నియమాలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరిస్తుంది. కమిషన్ న్యాయ బద్దంగా విచారణ చేయాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా వివక్ష లేకుండా పారదర్శకంగా విచారణ చేయాలి’’ అని జగదీష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్‌ ఇచ్చాం. బండి సంజయ్‌కు కనీస పరిజ్ఞానం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ ఇద్దరూ ఒక్కటే. కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటేనని ఐదేళ్ల నుంచి చెబుతున్నాం’’ అని  జగదీష్‌రెడ్డి అన్నారు.

 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement