గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్‌గా దూదిమెట్ల 

Dudimetla Balaraju Yadav Chairman Of Sheep Goat Development Federation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య నూతన చైర్మన్‌గా డాక్టర్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మాసాబ్‌ట్యాంకులోని సమాఖ్య కార్యాలయంలో జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, వి.శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు హాజరై బాలరాజు యాదవ్‌ను అభినందించారు.

అనంతరం అభినందన సభలో మంత్రులు మాట్లాడుతూ...తెలంగాణ ఉద్యమంలో బాలరాజు యాదవ్‌ పాత్రను అభినందిస్తూ, ఉద్యమంలో ఆయన కృషిని గుర్తిస్తూ సీఎం కేసీఆర్‌ పదవిని అప్పగించారన్నారు. రాష్ట్రంలో పాడి, మాంస, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ దేశంలోనే ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశ పెట్టారని, గొర్రెల పంపిణీ పథకం ద్వారా మాంస పరిశ్రమ అభివృద్ధికి కేసీఆర్‌ బాటలు వేశారన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్‌ యాదవ్, అంజయ్య యాదవ్, దానం నాగేందర్, బేతి సుభా‹ష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top