స్టాలిన్‌కు షాక్‌.. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న కీలక నేత

DMK Leader Subbulakshmi Jagadeesan Quits Active Politics - Sakshi

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు గట్టి షాక్‌ తగిలింది. అధికార డీఎంకే పార్టీలో కీలక నేత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మంగళవారం లేఖ రాశారు కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ సుబ్బలక్ష‍్మి జగదీశన్‌. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

1947లో ఎరోడ్‌ జిల్లాలో జన్మించిన సుబ్బలక్ష‍్మి జగదీశన్‌.. ద్రావిడ మున్నెట్ర కజగం(డీఎంకే) పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. తిరుచెంగోడ్‌ నియోజకవర్గం నుంచి 14వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రిగా 2004-2009 వరకు బాధ్యతలు చేపట్టారు. అంకు ముందు 1977-1980, 1989-1991 వరకు తమిళనాడు ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో దిగేది ఆ ఇద్దరే! సోనియా సపోర్ట్‌ ఎవరికంటే..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top