రెండేళ్లలోనే కూటమి గ్రాఫ్‌ పడిపోయింది: ధర్మాన | Dharmana Prasada Rao Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

రెండేళ్లలోనే కూటమి గ్రాఫ్‌ పడిపోయింది: ధర్మాన

Apr 19 2026 11:35 AM | Updated on Apr 19 2026 12:32 PM

Dharmana Prasada Rao Fires On Chandrababu

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఏపీలో అరాచక పాలన నడుస్తోందని.. ప్రతిపక్షం లేకుండా చేయాలని అనుకుంటున్నారు.. ఇది సరైన పద్దతి కాదంటూ కూటమి సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో ప్రజాస్వామ్యం తిరోగమనంలో ఉందని.. ప్రధాన ప్రతిపక్షాన్ని అల్లరి పాలు చేసే కుట్రలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘రెడ్‌బుక్‌లో ఉన్నవారిని వేధిస్తూ ఇదే మా పాలన తీరు అని చెబుతున్నారు. సోషల్‌ మీడియా యాక్టివిస్టులను తీవ్రవాదులను వేటాడినట్టు వేటాడుతున్నారు. రెండేళ్లలోనే కూటమి గ్రాఫ్‌ పడిపోయింది’’ అని ధర్మాన పేర్కొన్నారు.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement