దేవినేని ఉమపై సోదరుడు చంద్రశేఖర్‌‌ వ్యంగ్యస్త్రాలు

Devineni Chandrasekhar Satires On Brother Devineni Uma - Sakshi

సాక్షి, కృష్ణా : టీడీపీ నేత దేవినేని ఉమాపై ఆయన సోదరుడు చంద్రశేఖర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. తన సోదరుడు ఉమాకు రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదని దేవినేని చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో మంగళవారం మాట్లాడుతూ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ ఉంపుడుగత్తెలా వ్యవహరస్తున్నాడని నిప్పులు చెరిగారు. టీడీపీ ఇచ్చిన 650 హామీల్లో అయిదు హామీలు కూడా నెరవేర్చలేదని విమర్శించారు. అదే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక 18 నెలల్లోనే అన్ని వర్గాలకు సంక్షేమం అందించారన్నారు. చదవండి: వల్లభనేని సవాల్‌.. దేవినేని ఉమ హైడ్రామా

సంక్షేమాన్ని అడ్డుకునేందుకే టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీనియర్‌ రాజకీయ నాయకులని భుజాలు చరుచుకునే చంద్రబాబు.. పేదలకు ఎన్ని పట్టాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు ఒకేసారి లక్షలాది మందికి పట్టాలు ఇస్తుంటే కన్నుకుట్టి రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నేతల ఉత్తర ప్రగల్బాలను ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీఎం విచారణ జరిపించాలని దేవినేని చంద్రశేఖర్‌ కోరారు. చదవండి: ‘ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించబోతున్నాం’

టీడీపీ నేత దేవినేని ఉమా పెద్ద డ్రామా ఆర్టిస్టు అని ప్రజలందరికీ తెలుసు అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలును చూసి తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతుందన్నారు. పోలీసులు ఎలాగూ ధర్నా చేయనివ్వరని తెలిసి గొల్లపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గరకు వచ్చి దేవినేని ఉమా డ్రామాలాడుతున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి పతకం అమలువుతున్నప్పుడు వెంటనే ప్రభుత్వం బురదజల్లడానికి తెలుగుదేశం పార్టీ తయారవుతుందని ధ్వజమెత్తారు. గొల్లపూడిలో నిన్న 3648 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు ఇస్తుంటే.. చూసి ఓర్వలేక దేవినేని ఉమ నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. 

దేవినేని ఉమకు చిత్తశుద్ధి ఉంటే.. పత్రికా ముఖంగానైనా లేదా ఒక టీవీ స్టూడియోకి వస్తే చర్చకు రావాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ సవాల్‌ విసిరారు. పోలీసులు ఎలాగూ అడ్డుకుంటారని తెలిసి తెలిసి రోడ్ల మీదకు వచ్చి డ్రామాలు చేయడం కరెక్ట్‌ కాదన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో గొల్లపూడిలో ఒక్క పట్టా కూడా ఇవ్వలేదన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అవకతవకలు జరిగాయని దేవినేని ఉమా మాట్లాడుతున్నారని, ‘ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మైలవరం, గొల్లపూడి లబ్ధిదారులను పిలిపించి సమావేశం పెడదాం.. మీడియా సమక్షంలో చర్చకు సిద్ధమా..’ అని దేవినేని ఉమాకు సవాల్‌ విసిరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top