కాంగ్రెస్‌లోకి రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌..!

D Srinivas likely to Join Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ రాజకీయ నాయకుడు,  టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) కాంగ్రెస్‌ చేరడం దాదాపు ఖరారైంది. ఈ మేరకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ డీఎస్‌తో చర్చలు జరుపుతోంది. ప్రస్తుత పరిణామాలను బట్టిచూస్తే రెండు, మూడు రోజుల్లోనే ఇది వాస్తవరూపం దాల్చే అవకాశం ఉంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడిగా డి.శ్రీనివాస్‌ కొనసాగుతున్నారు. త్వరలోనే డీఎస్‌ రాజ్యసభ సభ్యత్వం ముగియనుంది. కాగా, కొద్దిసేపటి క్రితమే సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అధిష్టానం నుంచి ఢిల్లీకి రావాలని పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.

చదవండి: (గుడ్‌న్యూస్‌! హైదరాబాద్‌కి పెట్‌ కేర్‌.. వరంగల్‌కి ఐటీ కంపెనీ..)

2004లో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక కేబినెట్‌ మంత్రిగా పనిచేశారు. 2009లో వైఎస్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినా డీఎస్‌ ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక సీఎం హోదాలో కేసీఆర్‌ స్వయంగా డీఎస్‌ ఇంటికెళ్లి తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎస్‌ కుమారుడు ధర్మపురి అరవింద్‌ బీజేపీ టికెట్‌పై నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, సిట్టింగ్‌ ఎంపీ కల్వకుంట్ల కవితను ఓడించారు. ఆ తర్వాత తనకు తగిన గౌరవం ఇవ్వలేదని, వివిధ ఆరోపణలు చేసి అవమానించారని, డీఎస్‌ కొంతకాలంగా టీఆర్‌ఎస్‌కు దూరంగానే ఉంటున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top