మీ స్వార్థానికి జర్నలిస్టులను బలి చేస్తారా? | Sakshi
Sakshi News home page

మీ స్వార్థానికి జర్నలిస్టులను బలి చేస్తారా?

Published Fri, Feb 23 2024 5:16 AM

Conspiracy behind attack on photographer in Raptadu - Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌: చంద్రబాబు, లోకేశ్, ఈనాడు రామోజీరావు, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ–5 సాంబ స్వార్థాలకు జర్నలిస్టులను బలి చేస్తున్నారని రాప్తాడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌­రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని, విలేకరులపై దాడు­లకు తెగబడుతోందంటూ ఈనాడులో వచ్చిన కథ­నాన్ని ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఖండించారు. అనంతపురంలో గురువారం ఆయన మీడియాతో మాట్లా­డారు.

ఈనాడు, ఏబీఎన్, టీవీ–5 మీడి­యాను వైఎస్సార్‌సీపీ బ్యాన్‌చేసి ప్రెస్‌మీట్‌లు, మీటింగ్‌లకు రావద్దని స్పష్టంచేసినప్పటికీ  ఏకంగా 10 లక్షల మంది వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు వచ్చి­న రాప్తాడు ‘సిద్ధం’ సభకు ఏబీఎన్‌ లోగో పట్టు­కుని శ్రీకృష్ణ అనే ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ ఎందుకొచ్చా­రని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆయనను ఎవరు పంపించారు? దాడి జరుగుతుంటే మరో ఏబీఎన్‌ ఉద్యోగి అక్కడి నుంచి జారుకోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

అలాగే, ఓవైపు దాడి జరుగుతుంటే రక్షించే ప్ర­య­త్నం చేయకుండా వీడి­యోలు తీయ­డం వెనుక ఉద్దేశమేమిటో కూడా పోలీసులు వెలికితీయా­లన్నారు.  నిజానికి.. ప్రభు­త్వంపై ఎంత దుర్మార్గంగా, వాస్తవాలను వక్రీకరించి కథ­నాలు రాస్తున్నా రాష్ట్రంలో ఎక్కడా దాడులు జరగ­లేదని.. ఈ  సభకు ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ లోగో పట్టుకుని వెళ్లడం చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. 

దాడులకు వారే బాధ్యత వహించాలి..
ఇక రాప్తాడులో ఏబీఎన్‌ ఫొటోగ్రాఫర్‌పై, కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడి జరిగినా అందుకు పూర్తిబాధ్యత వహించాల్సింది చంద్రబాబు, లోకేశ్, ఏబీఎన్‌ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, టీవీ–5 సాంబ మాత్రమేనని తోపుదుర్తి స్పష్టంచేశారు. గత­ంలో పవన్‌కళ్యాణ్, మోదీని కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడారని ప్రకాష్‌రెడ్డి గుర్తుచేశారు.

వైఎస్సా­ర్‌­సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజా­స్వామ్య­వాదులని, చాలా సహనం, ఓర్పు కల్గిన వాళ్లని ఆయనన్నారు. తప్పు­డు కథనాలు రాస్తూ ప్రభుత్వాన్ని గద్దె దించుతా­మని భావిస్తే అది వారి అమాయకత్వమే అవుతుందన్నారు.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement