సాక్షి, అనంతపురం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గం పర్యటనలో ఉన్నారు. కాసేపటి క్రితమే లింగనపల్లి హెలీప్యాడ్ వైఎస్ జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మరోవైపు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. కాగా, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖరరెడ్డి కుమార్తె వివాహానికి వైఎస్ జగన్ హాజరయ్యారు.


