తెలంగాణ భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ యత్నం | Congress Supporters Try To Attack Telangana Bhavan, Heavy Police Presence Outside | Sakshi
Sakshi News home page

తెలంగాణ భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ యత్నం

Jun 22 2025 3:09 PM | Updated on Jun 22 2025 5:46 PM

Congress Supporters Try To Attack Telangana Bhavan

హైదరాబాద్‌:  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చేపట్టింది. దీనిలో భాగంగా ఆదివారం(జూన్‌ 22) తెలంగాణ భవన్‌ను ముట్టడించడానికి యత్నించారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. తెలంగాణ భవన్‌లోకి దూసుకుపోవడానికి యత్నించారు. 

దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్‌ కార్యకర్తల్ని చెదరగొట్టి పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. సీఎం బినామీలే అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని, తెలంగాణ మంత్రులు ఇసుక దందాకు పాల్పడుతున్నారని నిన్న(శనివారం) వరంగల్‌లో కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు.  ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను తెలంగాణ భవన్‌ వేదికగా బయటపెడతాననని కౌశిక్‌రెడ్డి విమర్శించారు. 

Advertisement
 
Advertisement
Advertisement