కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల అప్పుడే.. | Congress To Release Poll Manifesto On April 6 | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల అప్పుడే..

Mar 28 2024 10:13 PM | Updated on Mar 28 2024 10:16 PM

Congress To Release Poll Manifesto On April 6 - Sakshi

న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనుంది.  గత పదేళ్లుగా పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో ఓడిపోతున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా గెలవాలనే తపనతో ఉంది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ప్రజలందరినీ ఆకట్టుకునేలా మేనిఫెస్టోను తయారు చేసింది.

జైపూర్‌లో ఏప్రిల్ 6న జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ కలిసి పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారని ఆ పార్టీ రాజస్థాన్ ఛీఫ్‌ గోవింద్ సింగ్ దోటసార తెలిపారు. 

కాంగ్రెస్‌ విడుదల చేయనున్న మేనిఫెస్టోను ఫ్రేమింగ్ కమిటీకి నేతృత్వం వహించిన మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం "ప్రజల మేనిఫెస్టో"గా అభివర్ణించారు. ఈ మేనిఫెస్టో తయారీ కోసం కాంగ్రెస్‌ పార్టీ జనవరిలో ప్రజల నుంచి ఆలోచనలు, సూచనలను ఆహ్వానించింది.

Advertisement
 
Advertisement
Advertisement