అసెంబ్లీలో అవిశ్వాస రణం

Congress No Confidence Motion Against Yediyurappa - Sakshi

జరపాలని కాంగ్రెస్‌ పట్టు   

ఎమ్మెల్యేల గైర్హాజరు వల్ల సాధ్యం కాదన్న సభాపతి 

సాక్షి, బెంగళూరు: అవిశ్వాస తీర్మానాన్ని అమలు చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్, కరోనా వైరస్‌ వల్ల సాధ్యపడదని అధికార బీజేపీ ఎమ్మెల్యేల పట్టుతో శనివారం విధానసభ వేడెక్కింది. యడియూరప్ప ప్రభుత్వం ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప, ఆయన మంత్రివర్గం.. సభలో విశ్వాసం నిరూపించుకోవాలని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య నోటీసులు ఇచ్చారు. సభాపతి విశ్వేశ్వరహెగడేకాగేరి మాట్లాడుతూ చాలామంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి సభకు రాని కారణంగా ఓటింగ్‌ నిర్వహించడం సాధ్యం కాదని తెలిపారు.  (సీనియర్ల అసంతృప్తి.. సీఎంను తప్పించండి)

కరోనా సోకిన సభ్యులు పీపీఈ కిట్‌లు ధరించి వచ్చినా అనుమతి కష్టమే అన్నారు.రాజకీయం, అధికారం కంటే మానవీయ కోణంలో ఆలోచించాలని అన్నారు. ఈ నేపథ్యంలో మూజువాణి ద్వారా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. సీఎం యడియూరప్ప చర్చను చూస్తూ ఉండిపోయారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ సామాజిక బాధ్యత తమకూ ఉందని.. మూజువాణి ఓటుకు అంగీకరిస్తున్నామన్నారు. అనంతరం సమావేశాలను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు సభాపతి విశ్వేశ్వర హెగడే కాగేరి ప్రకటించారు. ఈ నెల 28వ తేదీన రైతుసంఘాలు జరిపే బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు సిద్ధు తెలిపారు.   
 
ఎస్పీ బాలుకు నివాళి   
దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యానికి ఉభయ సభల్లో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఎస్పీ బాలుకు కర్ణాటకతో ఉన్న అనుబంధం గురించి సభ్యులు కొనియాడారు.     

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top